అనగనగా ఒక రాజు.. తెర ముందు వెనక నవీన్ పొలిశెట్టి..?

ఐతే అదే దారిలో ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా తన సినిమాలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నాడు.;

Update: 2026-01-06 06:31 GMT

యువ హీరోలు ఈమధ్య తమ సినిమాల విషయంలో పూర్తిస్థాయి ఇన్వాల్వ్ మెంట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక సినిమా కథ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు డైరెక్టర్ కన్నా తన ఇన్వాల్వ్ మెంట్ తోనే ఎక్కువ హైప్ ఎక్కిస్తున్నారు. రైటింగ్ లో టచ్ ఉండటం వల్ల ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ కేవలం డైరెక్షన్ ఒక్కటే చేయట్లేదు కానీ దాదాపు వాళ్లు చేస్తున్న సినిమా అంతా వాళ్ల ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది. ఇలా సిద్ధు జొన్నలగడ్డ 3 ఏళ్ల క్రితం డీజే టిల్లు తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. సిద్ధు తన టీం తో కలిసి కథ రాసుకుని అందులో ఒకరిని డైరెక్షన్ లో సినిమాలు చేశాడు.

సంక్రాంతికి వస్తున్న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు..

డీజే టిల్లుతో అతనికి స్టార్ డం రావడంతో తను స్టోరీ డిస్కషన్స్ లో కూర్చోవట్లేదు. ఐతే అదే దారిలో ఇప్పుడు నవీన్ పొలిశెట్టి కూడా తన సినిమాలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నాడు. ఈ సంక్రాంతికి వస్తున్న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమా విషయంలో నవీన్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అంతా తానై నడిపించాడని తెలుస్తుంది. అసలైతే ఈ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో రావాల్సింది. ఐతే అతను మ్యాడ్, మ్యాడ్ మాక్స్ కి వెళ్లడంతో నవీన్ తన టీం తోనే ఈ స్క్రిప్ట్ పూర్తి చేశాడట.

ఇక తన టీం లో ఒక మెంబర్ అయిన మారి నే డైరెక్టర్ గా తీసుకున్నారట. ఐతే అనగనగా ఒక రాజు స్క్రిప్ట్ దగ్గర నుంచి అన్నిటిలో నవీన్ ఉన్నాడు. అందుకే అనగనగా ఒక రాజు సినిమా డైరెక్టర్ పేరు ఎక్కడ వినిపించట్లేదు. నవీన్ టీం లోని మెంబర్ కాబట్టి డైరెక్టర్ మారి కూడా ప్రమోషన్స్ బాధ్యత కూడా హీరో మీదే పెట్టేశాడు. రీసెంట్ గా అనగనగా ఒక రాజు నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ కూడా ఆ సినిమా డైరెక్టర్ గురించి పెద్దగా ప్రస్తావించలేదు.

ప్రమోషన్స్ కోసం నవీన్ ప్లానింగ్..

జస్ట్ పేరుకే మారిని పెట్టారు కానీ నవీన్ పొలిశెట్టినే ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అంతా నడిపించాడని అంటున్నారు. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ లో నవీన్ అనగనగా ఒక రాజు ముందు ఉంది. సినిమా ప్రమోషన్స్ కోసం నవీన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. ముఖ్యంగా తనని ఇష్టపడుతున్న యూత్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు నవీన్ పొలిశెట్టి.

అనగనగా ఒక రాజు సినిమా 3 ఏళ్ల క్రితమే మొదలైనా మధ్యలో నవీన్ కి యాక్సిడెంట్ వల్ల షూటింగ్ లేట్ అయ్యింది. ఫైనల్ గా 2026 సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్ చేసేందుకు నవీన్ వచ్చేస్తున్నాడు. నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే సినిమాలోని భీమవరం బాల్మా సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.

Tags:    

Similar News