కంగన, అలియాభట్ కోసం ఎదురు చూస్తోన్న హీరో!
స్టార్ హీరోలతో కలిసి పని చేయాలని హీరోయన్లు ఎంత ఆశగా ఎదురు చూస్తారో? అదే స్టార్ హీరోయిన్లతో నటించాలని యంగ్ హీరోలు కూడా అంతే ఆసక్తిగా ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తుంటారు.;
స్టార్ హీరోలతో కలిసి పని చేయాలని హీరోయన్లు ఎంత ఆశగా ఎదురు చూస్తారో? అదే స్టార్ హీరోయిన్లతో నటించాలని యంగ్ హీరోలు కూడా అంతే ఆసక్తిగా ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తుంటారు. కానీ అదంత ఈజీ కాదు. స్టార్స్ కాంబినేషన్ కలిసినంత ఈజీగా? యంగ్ హీరోలతో నటించడానికి పేరున్న భామలు ముందుకురారు. చాలా అరుదుగా జరిగినా? స్టార్ హీరోయిన్ల సినిమాలో యంగ్ హీరో అనేవాళ్లు సపోర్టింగ్ రోల్స్ లోనే కనిపిస్తుంటారు. నవీన్ పొలిశెట్టి ఈ విషయంలో ఎంతో లక్కీ. నాలుగైదు సినిమాల్లో నటించే స్వీటీ అనుష్క సరసన నటించే ఛాన్స్ కొట్టేసాడు.
`మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` సినిమా లో అనుష్క, నవీన్ జంటగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అందులో మెయిన్ లీడ్ అనుష్క పోషించినా నవీన్ పాత్ర కు మంచి ప్రాధన్యత ఉంటుంది. ఆ పాత్రను కామిక్ గా మలిచారు. అనుష్క సరసన నటిస్తానని నవీన్ ఏనాడు ఊహించి ఉండడు. ఆ ఛాన్స్ అనుకోకుండా వచ్చింది. అయితే ఇలాంటి అవకాశం మరో ఇద్దరు భామలతో కూడా వస్తుందని నవీన్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. బాలీవుడ్ హీరోయిన్లు కంనగా రనౌత్, అలియాభట్ లతో కలిసి నటించడం అన్నది డ్రీమ్ గా భావిస్తున్నాడు. అనుష్కతో పాటు, అలియాభట్, కంగనలు తనకు అభిమాన హీరోయిన్లగా వెల్లడించాడు.
అనుష్కతో నటించిన సమయంలో తానెంత సంతోషపడ్డాడో? తనకు మాత్రమే తెలసునని.. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనన్నాడు. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు నిజంగా తనకే ఆ ఛాన్స్ వచ్చిందా? అని నమ్మలేకపో యానన్నాడు. అదో షాకింగ్ లా ఉందన్నాడు. ఆన్ సెట్స్ లో అనుష్కతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. మిగతా ఇద్దరు హీరోయిన్లతో కూడా అవకాశాలు వస్తాయని ఆశీస్తున్నానన్నాడు. వాళ్లతో ఛాన్స్ వచ్చిన ఆ క్షణం చేతిలో ఎన్ని సినిమాలున్నా? వాటిని వదులుకుని వెళ్లిపోతానని నవ్వేసాడు.
ఇక నవీన్ కెరీర్ సంగతి చూస్తే `జాతిరత్నాలు` తర్వాత నటుడిగా బిజీ అవుతాడు? అనుకుంటే నవీన్ కెరీర్ అలాసాగలేదు. `జాతిరత్నాలు` తర్వాత నటించింది ఒకే ఒక్క చిత్రం. అదీ యావరేజ్ గా ఆడింది. దాదాపు మూడేళ్ల తర్వాత నటీన్ నటించిన `అనగనగా ఒక రాజు` సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తుంది. `మనశంకర వర ప్రసాద్ గారు`, `భర్త మహాశయులకు విజ్ఞప్తి`, ` నారీ నారీ నడుమ మురారీ లాంటి సినిమాలున్నా? ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.