నవదీప్ 'లవ్ మౌళి'.. ఘాటైన పోస్టర్ తో రిమైండర్!

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ ను మరోసారి గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

Update: 2024-05-23 06:26 GMT

టాలీవుడ్ నటుడు నవదీప్.. చాలా గ్యాప్ తర్వాత హీరోగా లవ్ మౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. నవదీప్ 2.0గా ఆయన కనిపించనున్న ఈ మూవీకి అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌ తో క‌లిసి క్రియేటివ్ టాలెంట్ కు అడ్డా అయిన సీ స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మిస్ ఇండియా కంటెస్టెంట్ పంఖురీ గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా కుదరలేదు.

 

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. మంచి హైప్ క్రియేట్ చేసింది. మూవీ కచ్చితంగా చూడాలనే ఆసక్తిని ఆడియన్స్ లో పెంచింది. ఇటీవల ఈ సినిమా సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. సెన్సార్ స‌భ్యుల నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఈ మూవీని జూన్ 7వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ ను మరోసారి గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. "వినూత్నమైన ప్రేమ కథను చూసేందుకు సిద్ధంగా ఉండండి. లవ్ మౌళి జూన్ 7వ తేదీన థియేటర్లలోకి వస్తుంది. డేట్ గుర్తుపెట్టుకోండి. మరపురాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను పొందండి" అని పోస్ట్ చేశారు మేకర్స్. ఇక తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో హీరోయిన్లు ఘాటుగా లిప్ లాక్ పెట్టుకుంటున్నట్టు మేకర్స్ చూపించారు.

Read more!

అయితే మేకర్స్ ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, పోస్టర్ల ద్వారా ఈ సినిమాలో కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సెన్సార్ బోర్డ్.. ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ మూవీతో హీరోగా మళ్లీ ఫామ్ లోకి రావాలని నవదీప్ ఫిక్స్ అయ్యారు. మంచి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. తన జీవితంలో జరిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా అని ఇప్పటికే అనేక సందర్భాల్లో తెలిపారు.

ఇక లవ్ మౌళి సినిమా ఓ పెయింటర్ ప్రేమకథగా తెలుస్తోంది. నవదీప్ ఫ్రెండ్ క్యారెక్టర్‌ లో భావన సాగి నటించింది. గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించగా.. కృష్ణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. ఆర్ట్ డైరెక్టర్ గా కిరణ్ మామిడి వ్యవహరించారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ సహా నిర్మాతగా ఉన్నారు. అయితే తన రెండో వెర్షన్ తో వస్తున్నానని, సెకండ్ ఇన్నింగ్స్ అని చెబుతున్న నవదీప్.. ఈ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News