టెలివిజన్ రంగంలో డ్రగ్స్ కలకలం: నటి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ టెలివిజన్ పరిశ్రమ తెరవెనుక చీకటి కోణాలపై నటి నారాయణి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

Update: 2026-07-24 12:30 GMT

బాలీవుడ్ టెలివిజన్ పరిశ్రమ తెరవెనుక చీకటి కోణాలపై నటి నారాయణి శాస్త్రి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. వినోద పరిశ్రమలో డ్రగ్స్ సంస్కృతి గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు పార్టీల్లో ఆల్కహాల్‌కే పరిమితమైన బడ్జెట్ ఇప్పుడు ప్రత్యేకంగా అక్రమ మాదకద్రవ్యాల కోసం కేటాయిస్తున్నారంటూ అమ్మ‌డు చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణి శాస్త్రి మాట్లాడుతూ తాను కూడా స్వయంగా ఈ పార్టీలను చూసి షాక్‌కు గురయ్యానని తెలిపారు.

ఈ కారణంగానే కొన్నేళ్ల కిందటే ఇలాంటి పార్టీలకు వెళ్లడం మానేశానన్నారు. వినోదం, నృత్యాల కోసం కాకుండా పార్టీల ఉద్దేశమే పూర్తిగా మారిపోయిందన్నారు. కోకైన్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ సర్వసాధారణంగా వాడుతున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద పార్టీల్లో ఈ కార్యకలాపాలు గోప్యంగా జరుగుతుంటాయని.. చిన్న , సన్నిహిత సమావేశాల్లో మాత్రం అందరికీ తెలిసే తంతు జరుగుతుందని నారాయణి పేర్కొన్నారు. అలాగే త‌న‌ వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడారు. తాను కూడా గతంలో ప్రయోగాత్మకంగా కొన్నిసార్లు డ్రగ్స్ పరీక్షించి చూశానని అయితే వాటికి ఎప్పుడూ బానిస కాలేదన్నారు.

ఎవరైనా డ్రింక్స్‌లో కలిపితే ఎలా ఉంటుందో? తెలుసుకోవడానికి ఒక్కసారి ఆల్కహాల్‌ను కూడా టేస్ట్ చేశానని తెలిపారు. పార్టీలకే పరిమితం కాకుండా షూటింగ్ సెట్లలో కూడా డ్రగ్స్ ప్రభావం కనిపిస్తోందని నారాయణి సంచలన ఆరోపణ చేశారు. నటులు సరైన స్థితిలో లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో షూటింగ్‌లు రద్దయిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేశారు. ఒకసారి నటుడు నిలబడే స్థితిలో కూడా లేకపోవడంతో తాను సెట్లో ఏకంగా నాలుగు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చిందని వెల్లడించారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటార‌ని నారాయణి అభిప్రాయపడ్డారు. ప్రధాన నటులను మార్చితే సిరీస్ .. ఆ పాత్ర ఇమేజ్‌కే ప్రమాదం వాటిల్లుతుందనే భయంతో నిర్మాతలు చేసేది లేక వారి కుటుంబ సభ్యుల సహాయం కోరుతున్నారని తెలిపారు. డ్రగ్స్ కారణంగా షూటింగ్‌లకు అంతరాయం కలగడం పరిశ్రమకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైల‌ర్ గా మారాయి.

బుల్లితెరపై 'కుసుమ్', 'పియా కా ఘర్', 'క్యూంకీ సాస్ భీ కభీ థీ' వంటి విజయవంతమైన ధారావాహికలతో నారాయ‌ణి శాస్త్రి గుర్తింపు తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. సీరియ‌ల్స్ తో పాటు ప్రయోగాత్మక పాత్రల్లో సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. గ్లామర్ పాత్రల కంటే బలమైన అభినయానికి ప్రాధాన్యతనిచ్చే నటీమణులలో నారాయ‌ణి ముందువరుసలో నిలుస్తార‌న‌డంలో సందేహం లేదు.. అందుకే ఇండస్ట్రీలో దశాబ్దాలు గడుస్తున్నా? నారాయ‌ణి క్రేజ్ ఎక్క‌డా కింగ లేదు. కొత్త‌త‌రం న‌టీమ‌ణులు ఎంత మంది వ‌చ్చినా వారికి పోటీగా ప‌నిచేసి స‌త్తా చాటుతోంది.

Tags:    

Similar News