నానిని ఎప్పుడూ అలా చూడ‌లే

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని, ఆ త‌ర్వాత హీరోగా, నిర్మాత‌గా మారి ప‌లు సినిమాలు చేసిన‌ సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-04-22 12:15 GMT

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఇండ‌స్ట్రీలో కెరీర్ ను స్టార్ట్ చేసిన నేచుర‌ల్ స్టార్ నాని, ఆ త‌ర్వాత హీరోగా, నిర్మాత‌గా మారి ప‌లు సినిమాలు చేసిన‌ సంగ‌తి తెలిసిందే. వాల్‌పోస్ట‌ర్ సినిమాస్ బ్యాన‌ర్ ను స్థాపించి, అందులో కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తూ మంచి కంటెంట్ ను ఆడియ‌న్స్ కు అందిస్తున్నాడు నాని. అయితే నాని నిర్మాణంలో ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ సినిమా మంచి సినిమాలుగానే నిలుస్తూ వ‌చ్చాయి.

రీసెంట్ గా కోర్టు సినిమాతో నిర్మాత‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని ఆ సినిమాతో చాలా మంచి స‌క్సెస్ ను అందుకున్నాడు. ఇప్పుడు నాని హీరోగా త‌న బ్యాన‌ర్ నుంచి హిట్3 సినిమా రాబోతుంది. హిట్ ఫ్రాంచైజ్ లో వ‌చ్చిన‌ మొద‌టి రెండు సినిమాల‌కు కేవ‌లం నిర్మాత‌గానే వ్య‌వ‌హ‌రించిన నాని, ఇప్పుడు మూడో సినిమాకు త‌నే హీరోగా న‌టిస్తూ, ఆ సినిమాను నిర్మిస్తున్నాడు.

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమా మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. హిట్3 సినిమాతోనే శ్రీనిధి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోషన్స్ ను వేగ‌వంతం చేసి హిట్3ను తెగ ప్ర‌మోట్ చేస్తోంది.

ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీనిధి శెట్టి, నాని హిట్3 సెట్స్ లో ఎలా ఉంటాడ‌నే విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. సాధారణంగా ఎవ‌రైనా స‌రే నిర్మాత అంటే సెట్ లో అన్ని విష‌యాల‌ను చూసుకుంటూ, ప్ర‌తీదీ ప‌ట్టించుకుంటూ జాగ్ర‌త్త‌గా ఉంటూ ఉంటారు. కానీ నాని అలా కాద‌ని, త‌న‌ను సెట్స్ లో నిర్మాత‌గా ఎప్పుడూ చూడ‌లేద‌ని, నాని సెట్ లో ఉన్నంత సేపు ఎప్పుడూ యాక్ట‌ర్ గా ఉండ‌టానికే ప్రాధాన్య‌త ఇచ్చాడ‌ని తెలిపింది.

తాను ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ నానిని నిర్మాత‌గా చూడ‌లేద‌ని, అత‌ను ఎప్పుడూ యాక్ట‌ర్ గానే ఉంటాడ‌ని, త‌న‌కెప్పుడూ నాని నిర్మాత అనే వైబ్ కూడా క‌నీసం రాలేద‌ని శ్రీనిధి చెప్పింది. అంతేకాదు, నాని మ్యాజిక్ ను న‌మ్మే నిర్మాత అని, డ‌బ్బుని న‌మ్మే నిర్మాత కాద‌ని కూడా శ్రీనిధి ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చింది. ఇదే ఇంట‌ర్వ్యూలో నానిని డైరెక్ట‌ర్ తో మీకు నిర్మాత‌గా ఏమైనా అభిప్రాయ బేధాలు ఎదుర‌య్యాయా అని అడ‌గ్గా, నాని దానికి స‌మాధాన‌మిచ్చాడు.

తాను నిర్మాత అయిన‌ప్ప‌టికీ, డైరెక్ట‌ర్ అడిగింది ఇస్తూ త‌న‌కు అసిస్టెంట్ గా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తా అని చెప్పిన నాని, తాను ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌ర్క్ చేసినందు వ‌ల్ల అలాంటి క్రియేటివ్ డిఫ‌రెన్స్ లు వ‌చ్చే ఛాన్స్ లేద‌ని తెలిపాడు. ఏదేమైనా ఓ వైపు న‌టుడిగా, మ‌రోవైపు నిర్మాత‌గా ఒకే సినిమాకు వ‌ర్క్ చేయాలంటే ఎంతో ఓర్పు ఉండాల‌ని నాని హిట్3 ద్వారా అంద‌రికీ తెలియ‌చేస్తున్నాడు.

Tags:    

Similar News