తనూజ 'నో' చెప్పడం వల్ల 20 లక్షలు లాస్..?

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ రన్నరప్ గా నిలిచింది. సీజన్ మొదటి నుంచి ఆమె హాట్ ఫేవరేట్ గా ఉంది.;

Update: 2025-12-22 06:15 GMT

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ రన్నరప్ గా నిలిచింది. సీజన్ మొదటి నుంచి ఆమె హాట్ ఫేవరేట్ గా ఉంది. మధ్యలో టైటిల్ ఫైట్ లో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ వీళ్ల స్థానాలు మారుతూ వచ్చాయి కానీ తనూజ మాత్రం సీజన్ మొదలైన రెండు మూడు వారాల నుంచే విన్నర్ మెటీరియల్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే ఫైనల్ గా సీజన్ 9 లో రన్నరప్ గానే నిలిచింది తనూజ.

ఐతే తను కేవలం ఒక 2, 3 వారాలు మాత్రమే ఉంటానని అనుకుని వచ్చిన ఆమె ఆడియన్స్ సపోర్ట్ వల్ల ఫైనల్స్ వరకు వచ్చింది. టైటిల్ విన్నర్ మిస్సైనా ఆడియన్స్ లో తనూజ పాపులారిటీ డబల్ అయ్యింది.

గోల్డెన్ సూట్ కేస్ తో 20 లక్షలు..

ఐతే సీజన్ 9లో టాప్ 2గా కళ్యాణ్, తనూజ ఉన్న టైం లో హోస్ట్ నాగార్జున హౌస్ లోపలకి వెళ్లి వాళ్లిద్దరికీ గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీ లో ఆల్రెడీ డీమాన్ 15 లక్షలు తీసుకుని వెళ్లాడు కాబట్టి మిగిలిన 35 లక్షల్లో 20 లక్షలు ఆ గోల్డెన్ సూట్ కేస్ తో బయటకు రావొచ్చని చెప్పారు నాగార్జున. ఐతే టైటిల్ విన్ అవుతామన్న కాన్ ఫిడెన్స్ తో తనూజ, కళ్యాణ్ ఇద్దరు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు.

ఇక ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా కళ్యాణ్ ని అనౌన్స్ చేశారు నాగార్జున. సో తనూజ రన్నరప్ గా నిలిచింది. ఐతే ఆమె 20 లక్షలు తీసుకుని బయటకు వచ్చినా అప్పుడు కూడా రన్నరప్ గానే ఉండేది కానీ ఒక్క నో చెప్పడం వల్ల 20 లక్షలు లాస్ అవ్వాల్సి వచ్చింది. ఐతే తనూజ 20 లక్షల కన్నా ఆడియన్స్ తనకు వేసిన్స్ ఓట్స్ ఇంపార్టెంట్ అనుకుంది కాబట్టి ఆమె అలా ఉండాల్సి వచ్చింది.

బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ కళ్యాణ్ పడాల..

ఐతే టాప్ 3లో ఉన్న డీమాన్ పవన్ మాత్రం తనకు డబ్బు అవసరమని 15 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చేశాడు. సో అలా తనూజ 20 లక్షలు లాస్ అయితే డీమాన్ పవన్ 15 లక్షలు పొందాడు. ఐతే విన్నర్ అయిన కళ్యాణ్ పడాల 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు తన రెమ్యునరేషన్ ఇంకా ఒక లగ్జరీ కారు, రోఫ్ట్ నుంచి మరో 5 లక్షల ప్రైజ్ మనీ ఇలా 50 లక్షల దాకా అందుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9లో కామనర్ కళ్యాణ్ పడాల విజయం అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ గా డిజైన్ చేసిన ఈ సీజన్ లో ఒక కామనర్ టైటిల్ విజేత అవ్వడం ఆడియన్స్ ని ఖుషి చేసింది.

Tags:    

Similar News