అన్నయ్య మనస్సుకు దగ్గరైన హిట్ మెషిన్!
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ దర్శకుడి కి ఓ కల లాంటింది.;
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది ఇండస్ట్రీకి వచ్చిన ప్రతీ దర్శకుడి కి ఓ కల లాంటింది. ఒక్కసారైనా ఆయనతో పనిచేయాలని అనుకునే వారెంతో మంది. ఎంత పెద్ద దర్శకుడైనా సరే? మెగాస్టార్ తో పని చేయడం అన్నది ఓ గొప్ప జ్ఞాపకంగా, అనుభవంగా భావిస్తుంటారు. అన్నయ్య స్పూర్తితోనే చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎంతో మంది నటులు గా, దర్శకులుగా , నిర్మాతలుగా ఎదిగారు. చిరంజీవిని దగ్గర నుంచి చూడటం కోసమే ఇండస్ట్రీకి వచ్చి స్థిరపడిన వారు మరెంతో ఎంతో మంది. ఇండస్ట్రీ సహా మెగాస్టార్ ప్రభావం అంటే? ఆ స్థాయిలో ఉంటుంది.
పూరి కూడా క్యూలోనే:
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మెగాస్టార్ కంబ్యాక్ చిత్రాన్ని తెరకెక్కించాలి. కానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. ఆ తర్వాత `ఆటోజానీ` కథతోనూ అప్రోచ్ అయ్యారు. అక్కడా ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. అప్పటికే పూరి ఓ స్టార్ డైరెక్టర్ . ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. చిరంజీవి గురువుగా భావించే? బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో సైతం పూరి ఓ సినిమా కూడా చేసాడు. అంతటి పూరి జగన్నాధ్ కూడా అన్నయ్యతో 151 కాకపోతే 152 చేస్తా? అదీ కాకపోతో మరో సినిమా. చిరంజీవి ఒప్పుకునే వరకూ మెప్పించే ప్రయత్నం విరమించను. తప్పకుండా ఓ సినిమా చేసే రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రకటించాడు.
అదృష్టం తలుపు తట్టడంతో:
అదీ మెగాస్టార్ అంటే? కొన్ని కొన్ని కాంబినేషన్లు వెంటనే కుదురుతాయి. కొన్ని కుదరవు. చిరంజీవితో సినిమా చేయడం మాటల మాంత్రికుడు గురూజీకి ఓ డ్రీమ్ లాంటిందే. అన్నయ్యకు తగ్గ కథ తన దగ్గర సిద్దంగా లేకపోవడంతోనే తమ కాంబినేషన్ లో సినిమా ఆలస్యమవుతుందని త్రివిక్రమ్ ఎన్నో సందర్బాల్లో అన్నారు. ఇంకా చెప్పుకుంటే పోతే చిరంజీవి క్యూలో ఉన్న డైరెక్టర్లు చాలా మంది. అయితే వారందరి కంటే అనీల్ రావిపూడి టోకెన్ నెంబర్ మాత్రం తొందరగా వచ్చేసింది. ఈ విషయంలో అనీల్ ఎంతో అదృష్టవంతుడు.
అందరి కంటే అనీల్ కు ముందుగా:
ప్రస్తుతం చిరంజీవితో `మనశంకర వరప్రసాద్ గారు` అనే చిత్రం అనీల్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అనీల్ వరుస విజయాలు చూసి చిరంజీవి పిలిచి మరీ అనీల్ కు అవకాశం ఇచ్చారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవిపై తన అభిమానాన్ని అనీల్ వినూత్నంగా చాటుకున్నాడు. చిరంజీవి నటించిన పాత సినిమా సెట్ లకు వెళ్లి ఆయనతో సెల్పీలు దిగినట్లు ఓ ఏఐ వీడియోతో మెగా అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఈ వీడియోను ఉద్దేశించి `నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి , ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకూ` వరకూ అంటూ ఆ సెల్పీలను ఉద్దేశించి పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోతో అన్నయ్య మనస్సుకు అనీల్ మరోసారి చేరువయ్యాడు.