అంత జరిగినా సైలెంట్ ఎందుకు?

కొంతకాలంగా సెలబ్రెటీలు.. ముఖ్యంగా హీరోయిన్లపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరు.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.;

Update: 2025-12-22 07:21 GMT

కొంతకాలంగా సెలబ్రెటీలు.. ముఖ్యంగా హీరోయిన్లపై అభిమానాన్ని వ్యక్తం చేసే తీరు.. సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొందరు హద్దు మారి ప్రవర్తిస్తున్నారు. దీంతో హీరోయిన్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రీసెంట్ గా ఫ్యాన్స్ వల్ల నిధి అగర్వాల్ చేదు అనుభవం ఎదుర్కొనగా.. ఇప్పుడు సమంతకు కూడా అదే జరిగింది.

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొత్తగా ఏర్పాటు అయిన శారీస్ షోరూం ఓపెనింగ్ కు ఆదివారం సాయంత్రం సమంత విచ్చేశారు. ఆ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. సామ్ ను చూడాలనే ఉత్సాహంతో.. షోరూమ్ వద్ద అభిమానులు భారీగా గుమిగూడారు.

దీంతో షోరూం ఓపెనింగ్ అయ్యాక సామ్.. బయటకు వచ్చి తన కారు వైపు వెళ్లే సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఆ సమయంలో కొందరు అభిమానులు హద్దులు మీరి.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇంకొందరు ఆమె వెళ్తున్న వైపు పరుగులు తీశారు. సెక్యూరిటీ ఆపేందుకు ఎంత ట్రై చేసినా అక్కడ పరిస్థితి వల్ల కుదరలేదు.

చివరకు.. తీవ్రంగా శ్రమించి.. సామ్ ను కారు ఎక్కించారు భద్రతా సిబ్బంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా నిధి అగర్వాల్ విషయంలో కూడా అదే జరిగింది. ది రాజా సాబ్ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లగా.. ఒక్కసారిగా సినీ ప్రియులు, ఆడియన్స్ చుట్టుముట్టారు.

సెల్ఫీల కోసం తోసుకుంటూ ముందుకు వచ్చి.. ఆమెను తాకే ప్రయత్నం కూడా చేశారు. దీంతో ఆమె అసహనానికి గురైనట్లు కనిపించారు. ఆ సమయంలో కొందరు అభిమానులు అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. చివర్లో ఎలాగో ఒకలా.. తన కారు ఎక్కి నిధి అగర్వాల్ హమ్మయ్య అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో హీరోయిన్ల విషయంలో జరిగిన సంఘటనలపై ఇప్పుడు అనేక మంది నెటిజన్లు మండిపడుతున్నారు. అలా తయారేంటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఎంత అభిమానం ఉన్నా.. ప్రైవసీ ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు నిధి అగర్వాల్, సమంత తమ ఎదురైన చేదు అనుభవాలపై స్పందించలేదు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వారిద్దరూ.. ఆ విషయంపై మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఒక్క పోస్ట్ కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. దీంతో హీరోయిన్ల మౌనం చాలా ఆందోళన కలిగిస్తోందని పలువురు నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. ఒక్క పోస్ట్ పెట్టినా బాగుండేదని, అప్పుడైనా ఆకతాయిల్లో ఛేంజ్ వస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News