బన్నీ- అట్లీ మూవీ వెనక ఏం జరుగుతోంది?
సోషల్ మీడియా ప్రభావం పతాక స్థాయికి చేరి ఏఐ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోక తప్పడం లేదు.;
సోషల్ మీడియా ప్రభావం పతాక స్థాయికి చేరి ఏఐ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోక తప్పడం లేదు. ఎందుకంటే ఏది అబద్ధమో.. ఏది నిజమో తెలియడం లేదు. జరుగుతున్న ప్రచారం అబద్దం అని తెలిసినా ఫ్యాక్ట్ చెక్ చేసుకోక తప్పడం లేదు. ఇప్పడు ఇలాంటి పరిస్థితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు ఎదురవుతోంది. `పుష్ప 2` సంచలన విజయం తరువాత బన్నీ స్టార్ డబ్ మొత్తంగా మారిపోయింది.
వరల్డ్ వైడ్‌గా తన ఫేమ్‌తో పాటు తిరుగులేని స్థాయిలో మార్కెట్‌ని పెంచుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్‌లని కూడా అంతకు మించి అన్నట్టుగా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. `AA22XA6` అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీకి జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి హాలీవుడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారు. సూపర్ హీరో స్టోరీగా రూపొందుతున్న ఈమూవీ షూటింగ్‌కు ఇటీవల బ్రేక్ ఇచ్చారు. దీంతో బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలీడేస్‌ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తరువాతే బన్నీ ఫ్యామిలీ జనవరిలో ఇండియాకు తిరిగి రానున్నారు. డైరెక్టర్ అట్లీ కూడా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం రెడీ అవుతున్నాడు. ఆ తరువాతే కొత్త షెడ్యూల్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట.
ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫ్యాన్స్‌ని మాత్రం సర్‌ప్రైజ్ చేస్తూ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్త ఏంటంటే `పుష్ప` తరహాలోనే ఈ ప్రాజెక్ట్‌ని కూడా అట్లీ, బన్నీ రెండు భాగాలుగా చేయబోతున్నారని, భారీ బడ్జెట్, సినిమా రన్ టైమ్ కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.
టీమ్‌కు సీక్వెల్‌ని కానీ ఫ్రాంచైజీని కాని రూపొందించాలనే ఆలోచన లేదని, పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో సరికొత్త కథని ఇండియన్ ప్రేక్షకులకు అందించి సర్‌ప్రైజ్ చేయాలనే ఉద్దేశ్యంతో సినిమా రిలీజ్‌కు డెడ్‌లైన్‌ని కూడా విధించుకుని పని చేస్తోందట. ఈ సినిమాతో ఇండియన్‌ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలనే ప్లాన్‌లో భాగంగా ఈ మూవీని 2027 సమ్మర్‌కు భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా టీమ్ పని చేస్తున్నట్టుగా తెలిసింది. దాదాపు రూ.700 కోట్లకు మించి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈమూవీకి హాలీవుడ్ స్థాయి వీఎఫ్ ఎక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట. ఇందులో బన్నీకి జోడీగా దీపికా పదుకునే, రష్మిక మందన్న, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు.