'ది ప్యారడైజ్' రిలీజ్ వెనక్కి.. ఏం జరిగింది?
నేచురల్ స్టార్ నాని కథనాయకుడిగా నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు.;
నేచురల్ స్టార్ నాని కథనాయకుడిగా నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ది ప్యారడైజ్'. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా. 'దసరా'లో నానిని పవ్వలు తాగే ధరణిగా ఊరమాస్ క్యారెక్టర్‌లో చూపించి అందరిని ఆశ్చర్యపరిచిన శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్'లో మరో కొత్త అవతారంలో ప్రజెంట్ చేస్తున్నాడు. రెండు జడలు వేసుకుని నాని ఇందులో కనిపించనున్నాడు. తన క్యారెక్టర్ పేరే 'జడల్'. రూత్‌లెస్ మాసీవ్ క్యారెక్టర్‌లో నాని రెగ్యులర్ ర్యారెక్టర్లకు పూర్తి భిన్నంగా ఇందులో కనిపించనున్నాడు. 'దసరా' వంటి పాన్ ఇండియా సంచలనం తరువాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.
దీన్ని సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 'రా స్టేట్మెంట్' పేరుతో రిలీజ్ చేసిన వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేయడమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలతో పాటు సినీ లవర్స్‌ని షాక్‌కు గురి చేసింది. కారణం అందులో వాడిన భాష. చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిర్రు గానీ అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ. ..ఒక లం..కొడుకు కథ` అంటూ రా డైలాగ్స్‌తో విడుదలైన వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
అంతే కాకుండా బ్రూటల్ విలన్ శికంజ మాలిక్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు షర్ట్ లెస్‌గా, పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తుండటం, నవ్వులు పూయించే సంపూర్ణేష్ బాబు బిర్యానీగా సీరియస్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మిగతా కీలక పాత్రల్లో 'కిల్' ఫేమ్ రాఘవ్ జుయల్, సొనాలీ కులకర్ణి, తనికెళ్ల భరణి, ఈశ్వరీరావు, రాజా రవీంద్ర, రామ్ జగన్ నటిస్తున్నారు. నాని కెరీర్‌లోనే అత్యంత రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని ముందు మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
అయితే అది అయ్యే పని కాదని, ఆ డేట్‌కు రావడం కష్టమేనని అప్పట్లో నిర్మాత సుధాకర్ చెరుకూరి హింట్ ఇచ్చాడు. భారీ స్థాయిలో తీస్తున్న సినిమా కావడం, హెవీ సీన్స్ ఉండటం..ఎక్కువ వర్క్‌కు స్కోప్ ఉండటం వల్ల మార్చిలో వచ్చే అవకాశం లేదని, సమ్మర్‌లో వస్తుందని ఇండైరెక్ట్‌గా చెప్పేశాడు. అయితే ఇదే సమయంలో మార్చిలో రిలీజ్ రావాల్సిన 'పెద్ది' వాయిదా పడి ఏప్రిల్ 30కి వెళ్లడం, పెద్ది స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `ఉస్తాద్ భగత్‌సింగ్` రిలీజ్ అవుతుండటంతో నాని 'ది ప్యారడైజ్'ని సమ్మర్‌కు కాకుండా ఆగస్టుకు తీసుకెళ్లారు.
'ది ప్యారడైజ్' 90వ దశకం నేపథ్యంలో సాగే కథ. దీని కోసం భారీ సెట్‌లు, సికింద్రాబాద్ లోని ఓ ఏరియానే టీమ్ రీ క్రియేట్ చేసింది. దీనికి తోడు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వర్క్‌కు స్కోప్ ఉంది. అవన్నీ పూర్తి చేసుకోవాలంటే చాలా టైమ్ కావాలి. ఆ కారణంగానే ఈ మూవీ రిలీజ్‌ని ఆగస్టు 21కి మార్చేశారట. ఐదు నెలలు టైమ్ ఉండటంతో కావాల్సిన వర్క్‌ని పర్‌ఫెక్ట్‌గా పూర్తి చేసి భారీ స్థాయిలో ఓ విజువల్ వండర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని ఈ టైమ్‌ని టీమ్ తీసుకున్నట్టుగా తెలిసింది.