ప్యారడైజ్ ఆ ప్రయత్నాలు ఆపలేదట కదా..?

అంతకుముందు ఇలానే ఎన్టీఆర్ టెంపర్ సినిమా ఆఫర్ రాగా అది వద్దనేశారు మూర్తిగారు. ఐతే ఇప్పుడు నాని ప్యారడైజ్ ఆఫర్ కూడా కాదనే అన్నారట.;

Update: 2025-04-18 22:30 GMT

న్యాచురల్ స్టార్ నాని దసరా తర్వాత మళ్లీ శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమా ప్యారడైజ్. దసరా హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కలిసి మరోసారి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ ఏర్పడింది. ప్యారడైజ్ ఫస్ట్ స్టేట్మెంట్ అంటూ నాని టీం రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఆ టీజర్ చూసినప్పటి నుంచి ప్యారడైజ్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే సంథింగ్ స్పెషల్ అనేలా ఉంది.

దసరా తోనే నాని ఊర మాస్ చూపించాడని ఫీల్ అవుతుంటే ప్యారడైజ్ తో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు శ్రీకాంత్ ఓదెల. టీజర్ రిలీజ్ చేసి మీ అంచనాలు మీ ఇష్టం అన్నట్టుగా ఒక మాస్ స్టేట్మెంట్ ఇచ్చి పడేశాడు. ప్యారడైజ్ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా అని టాక్.

ఈ సినిమాలో ఒక బలమైన పాత్ర అది కూడా మంచి అభ్యుదయ భావాలున్న నేపథ్యం ఉన్న పాత్ర అట. ఐతే అలాంటి పాత్రకు పర్ఫెక్ట్ గా ఆర్.నారాయణ మూర్తి సరిపోతారని ఆయన్ను కలిశారట. ఐతే తను తీస్తే ప్రజలకు ఉపయోగపడే సినిమాలే తీస్తానంటూ దాదాపు 3 దశాబ్దాలుగా నారాయణ మూర్తి తన పంథా కొనసాగిస్తున్నారు. ఈమధ్యలో ఎన్నో సినిమాల ఆఫర్లు వచ్చినా కూడా చేయలేదు.

అంతకుముందు ఇలానే ఎన్టీఆర్ టెంపర్ సినిమా ఆఫర్ రాగా అది వద్దనేశారు మూర్తిగారు. ఐతే ఇప్పుడు నాని ప్యారడైజ్ ఆఫర్ కూడా కాదనే అన్నారట. కానీ శ్రీకాంత్ ఓదెల, నాని ఇద్దరు ఆయన్ని ఎలాగైనా ఒప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే నారాయణ మూర్తి గారిని మళ్లీ మళ్లీ కలుస్తున్నారని టాక్. నారాయణ మూర్తి ఒప్పుకోడని తెలిసినా నాని టీం ప్రయత్నాలు ఆపట్లేదట. ఒకవేళ ఏ దశలో అయినా ఆయన కన్విన్స్ అయితే సినిమాకు భారీగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకం.

ఒకవేళ ఆర్.నారాయణ మూర్తి చేయనంటే మాత్రం ఆ ప్లేస్ లో మరో నటుడిని తీసుకోవాలని చూస్తున్నారు. ప్యారడైజ్ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలో మొదలు కాబోతుంది. ఈ సినిమా మిగతా కాస్టింగ్ డీటైల్స్ త్వరలో తెలుస్తుంది.; ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి కూడా మంచి స్కోప్ ఉందని టాక్. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి అన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News