• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శివ‌న్న భారీ యాక్షన్...

శివ‌న్న భారీ యాక్షన్ ఇక్క‌డా మెప్పిస్తుందా?

| శివ‌రాజ్ కుమార్ అలియాస్ శివన్న న‌టించిన ఇటీవలి కన్నడ బ్లాక్‌బస్టర్ `భైరతి రణగల్` తెలుగు, త‌మిళంలోను విడుద‌ల కానుంది.

By - Tupaki Desk
Update: 2024-11-24 10:39 GMT

శివ‌రాజ్ కుమార్ అలియాస్ శివన్న న‌టించిన ఇటీవలి కన్నడ బ్లాక్‌బస్టర్ `భైరతి రణగల్` తెలుగు, త‌మిళంలోను విడుద‌ల కానుంది. శాండ‌ల్‌వుడ్ లో విజ‌యం సాధించిన ఈ చిత్రం ఇరుగు పొరుగు భాష‌ల్లోను పెద్ద హిట్ అవుతుంద‌ని శివ‌న్న న‌మ్ముతున్నారు. నార్ట‌న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చెబుతోంది.

నేచురల్ స్టార్ నాని తెలుగు ట్రైలర్‌ను లాంచ్ చేసారు. ట్రైల‌ర్ ఆద్యంతం శివ‌న్న మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్ తో ర‌క్తి క‌ట్టించారు. ప్రజల పక్షాన నిలబడే ఒక లాయ‌ర్ కార్పొరెట్ ని ఎదుర్కొనేందుకు డాన్‌గా రూపాంతరం చెందిన వైనాన్ని ట్రైల‌ర్ ఆవిష్క‌రించింది. శివన్న త‌న కెరీర్ లోనే ప‌వ‌ర్ ఫుల్ పాత్రలో మెరిశాడు. తెలుగు ట్రైలర్ ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా ఈ ట్రైల‌ర్ లో శివన్న యాక్షన్ ఎలివేష‌న్, ర‌వి బస్రూర్ రీరికార్డింగ్ ప్ర‌ధాన హైలైట్స్ గా నిలిచాయి. తెలుగు లోను ఇది విజ‌యం సాధిస్తుందా లేదా వేచి చూడాలి.

మైరా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అదే పేరుతో ( భైరతి రణగల్) తెలుగు వెర్షన్ ని 29 నవంబర్ 29 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, రాహుల్ బోస్, అవినాష్, దేవరాజ్ కీలక పాత్రలు పోషించారు. గీతా పిక్చర్స్ నిర్మించింది. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా పాన్-ఇండియన్ హిట్ గా నిలుస్తుందా లేదా? అన్న‌ది వేచి చూడాలి.

Wishing dearest shivanna a huge blockbuster in Telugu too with #BhairathiRanagal releasing on November 29th.Was very excited for this one when you showed me the trailer at your home anna. @NimmaShivanna 🤗#BhairathiRanagal Telugu Trailer OUT NOW!!#Narthan @rukminitweets… pic.twitter.com/2RrGXGggRz

— Nani (@NameisNani) November 24, 2024
Tags:    
  • Shivarajkumar 
  • Bhairathiranagal 
  • Rukminivasanth 
  • Nani 
  • Geethaarts 
  • Tollywood 
  • Sandalwood 
  • Ravibasrur 
  • Narthan 
  • Myracreations 
  • Bhairathiranagaltrailertelugu 
  • Filmindustry 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS