నాని 13 ఇయర్స్ లవ్.. ఫోటో అదిరింది..!

ఓ పక్క ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా కూడా నాని ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు.;

Update: 2025-10-28 06:20 GMT

ఓ పక్క ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా కూడా నాని ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలుసు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి తనకంటూ ఒక సెపరేట్ మార్క్ ఏర్పరచుకున్నాడు నాని. ఏంటి నాని సినిమా రిలీజ్ ఐతే ఏదో ఒక విషయం బాగుంటుంది అని ధైర్యంగా సినిమాకు వెళ్లేలా చేసుకునాడు. కెరీర్ మధ్యలో కొంత అప్ అండ్ డౌన్స్ వచ్చినా వాటిని దాటుకుని నాని న్యాచురల్ స్టార్ గా నిలబడిన తీరు అద్భుతం. అంతేకాదు కొత్త వారికి అవకాశం ఇవ్వడంలో నాని ది బెస్ట్ అనిపించుకుంటున్నాడు.




 


క్లాసీ లుక్ తో నాని..

ఐతే నాని లేటెస్ట్ గా సోషల్ మీడియాలో 13 అని పెట్టి పక్కన లవ్ సింబల్ ఇచ్చి తన భార్య అంజనతో ఉన్న ఫోటో షేర్ చేశాడు. నాని క్లాసీ లుక్ తో ఉండగా అతన్ని హగ్ చేసుకుంటూ అంజనా ఉంది. సో నాని, అంజన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఇలా మళ్లీ తమ మ్యారేజ్ వైబ్ ని చూపించారు. నాని, అంజనకు ఒక బాబు ఉన్నాడు. అతని పేరు అర్జున్. పెద్ద కొటేషన్స్ ఏమి లేకుండా ఇలా నాని, అంజన మీద ప్రేమను చూపించడం కూడా స్పెషల్ గా ఉందని చెప్పొచ్చు.

నాని కెరీర్ లో అంజన కూడా ఒక సపోర్టింగ్ పిల్లర్ గా నిలిచింది. అతని కెరీర్ టఫ్ టైం లో నానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చారు అంజన. నాని కూడా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఖాళీ టైం లో అర్జున్ తో సరదాగా ఆడుకోవడమే నానికి ఇష్టమని తెలుస్తుంది.

నాని అంజన 13వ వెడ్డింగ్ యానివర్సరీ..

నాని అంజన 13వ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నాని ఫ్యాన్స్ అంతా స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. నాని సినిమాల విషయానికి వస్తే ది ప్యారడైజ్ తో నెక్స్ట్ మరో మాస్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో ఆల్రెడీ దసరా లాంటి మాస్ హిట్ అందుకున్న నాని ఈసారి ది ప్యారడైజ్ అంటూ మరో విధ్వంసానికి రెడీ అవుతున్నాడు. 2026 మార్చి 26న ఆ సినిమా రిలీజ్ లాక్ చేశారు.

ఆ సినిమా తర్వాత నాని సుజీత్ కాంబో సినిమా లైన్లో ఉంది. ప్యారడైజ్ పూర్తి కావడమే నాని సుజీత్ డైరెక్షన్ లో సినిమాను కూడా పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ది ప్యారడైజ్ ఒక డిఫరెంట్ సినిమాగా వస్తుండగా సుజీత్ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. రెండు సినిమాలు నాని ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ లవర్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అందించేలా ఉంటుందని టాక్.

Tags:    

Similar News