• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోక్షజ్ఞ లుక్స్ అదుర్స్.....

మోక్షజ్ఞ లుక్స్ అదుర్స్.. హీరోగా ఎంట్రీ ఎప్పుడు బాలయ్యా?

| గురువారం ఉదయం బాలకృష్ణతో కలిసి విశాఖపట్నం టీడీపీ నేత మతుకుమిల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు మోక్షజ్

By - Tupaki Desk
Update: 2024-02-22 18:17 GMT

నందమూరి మూడో తరం వారసుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడు.. అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి కానీ, ఇంత వరకూ హీరోగా మోక్షు ఎంట్రీ జరగలేదు. బాలయ్య కుమారుడి డెబ్యూ ఇంకెప్పుడు అని కాస్త నిరాశలో ఉన్న ఫ్యాన్స్.. ఇప్పుడు మోక్షజ్ఞ లేటెస్ట్ ఫోటోలు చూసి ఖుషీ అవుతున్నారు.

గురువారం ఉదయం బాలకృష్ణతో కలిసి విశాఖపట్నం టీడీపీ నేత మతుకుమిల్లి భరత్ సోదరుని వివాహానికి హాజరయ్యాడు మోక్షజ్ఞ. పెళ్ళిలో తన తండ్రితో కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకి వచ్చాయి. ఇందులో మోక్ష వైట్ అండ్ వైట్ కుర్తా, పైజామా ధరించి స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. గతంలో కాస్తంత బొద్దుగా ఉన్న నందమూరి వారసుడు.. ఇప్పుడు చాలా స్లిమ్ గా హ్యాండ్సమ్‌గా మారిపోయాడు.

మోక్షజ్ఞ తాజాగా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. బాలయ్య కుమారుడి నయా లుక్స్, కటౌట్ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికే మోక్ష బరువు తగ్గాడంటూ ఆనందోత్సాహల్లో తేలిపోతున్నారు. ఈ సూపర్ లుక్ తన మొదటి సినిమా కోసమే అని అంటున్నారు. నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా ఈ కటౌట్ కి ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా, నందమూరి బాలకృష్ణ తన తండ్రి పేరును నిలబెడుతూ దశాబ్దాలుగా అభిమానులను అలరిస్తున్నారు. ఆ తర్వాతి జనరేషన్ లో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా లేగసీని కాపాడుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ఈ క్రమంలో మోక్షజ్ఞ కూడా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. కాకపోతే అది ఎప్పుడు అనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు.

మోక్షజ్ఞ హీరోగా లాంచ్ చేసే డైరెక్టర్ ఇతనే అంటూ గతంలో అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బాలయ్య మాత్రం ఇప్పటికే తన కుమారుడి కోసం స్క్రిప్ట్స్ పక్కకి తీసి పెట్టినట్లుగా చెబుతున్నారు. ‘ఆదిత్య 369’కు సీక్వెల్‌‌గా బాలకృష్ణ స్వయంగా కథ రాసుకున్న ‘ఆదిత్య 999 మ్యాక్స్’ లో మోక్ష నటించే అవకాశం వుందని వార్తలు వస్తున్నాయి.

టాలీవుడ్ నట వారసులంతా చాలా తక్కువ ఏజ్ లోనే హీరోలుగా తెరంగేట్రం చేశారు. నందమూరి ఫ్యామిలీకే చెందిన జూనియర్ ఎన్టీఆర్ 18 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయం అయ్యారు. మోక్షజ్ఞ ప్రస్తుత వయస్సు 29. సెప్టెంబర్ నాటికి 30ల్లో పడతాడు. కానీ ఇంత వరకూ సినీ రంగంలో ఎంట్రీ ఇవ్వలేదు. వీలయినంత త్వరగా బాలయ్య తనయుడిని సినిమాల్లోకి తీసుకురావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి త్వరలోనే వారి కోరిక నెరవేరుతుందేమో చూడాలి.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Mokshagnya 
  • Tollywood 
  • Sathyanand 
  • Aditya369sequel 
  • Directorbobby 
  • Balakrishnason 

Similar News

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Copyright @2026

Powered by Blink CMS