• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రజినీతో కింగ్.. మ్యాటర్...

రజినీతో కింగ్.. మ్యాటర్ ఎంతవరకు వచ్చింది?

| దాంతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-07-26 06:53 GMT

టాలీవుడ్ కింగ్ నాగార్జున.. 2024 సంక్రాంతికి నా సామి రంగ మూవీతో వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తన మార్క్ యాక్షన్ తో అలరించిన ఆయన.. తన సినిమాకు మంచి వసూళ్లు వచ్చేలా చేశారు. ఇప్పుడు నా సామి రంగ డైరెక్టర్ విజయ్ బిన్నీతో మరో సినిమా చేస్తున్నారు. దాంతోపాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర మూవీలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే కుబేర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే గత కొద్దిరోజులుగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారని వార్తలు వస్తున్నాయి. త‌లైవ‌ర్‌ ను ఢీకొట్టే పాత్ర‌లో నాగార్జున న‌టించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. తనకు మంచి స్నేహితుడు అయిన రజనీకాంత్ సినిమా కాబట్టి నాగార్జున కూడా వెంటనే ఒప్పేసుకున్నారని గుసగుసలు వినిపించాయి. దీంతో ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు.. భారీ అంచనాలు పెట్టుకున్నారు.

దానికి తోడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. తన సినిమాల్లో విలన్ రోల్ ను ఓ రేంజ్ లో చూపిస్తారు. మాస్టర్ లో విజయ్ సేతుపతి, లియోలో సంజయ్ దత్ రోల్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో నాగార్జున పాత్రపై అంతా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అయితే కూలీ మూవీలోని రోల్ పై నాగ్.. మొదట్లో ఆసక్తి చూపించారని, కానీ తర్వాత ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. విలన్ పాత్ర చేసేందుకు మొగ్గు చూపించలేదని సమాచారం.

ఇక కూలీ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సంగీతం అందిస్తున్నారు. ఇటీవల షూటింగ్ ప్రారంభం కాగా.. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తలైవర్ ను ఎప్పుడూ చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తానని లోకేష్ చెప్పిన మాటలకు తగట్టుగానే ఉంది.

యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్.. వింటేజ్ లుక్ తో ఆడియన్స్ ను అలరించనున్నారు. మాస్ లుక్ లో కనిపిస్తూనే ఎంటర్టైన్ కూడా చేయనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన ఈ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విలన్ ఆఫర్ ను నాగార్జున రిజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి ఎవరు ఆ రోల్ ను పోషిస్తారో వేచి చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • Coolie 
  • Rajinikanth 
  • Nagarjuna 
  • Sivakarthikryan 
  • Lokeshkanagaraj 

Similar News

యంగ్ హీరో మేకోవ‌ర్‌పై బిగ్ డిబేట్

2026-11-24 18:21 GMT

'ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్‌'తో పోలికా.. ఇది మ‌రీ కామెడీ!

2026-11-24 18:21 GMT

లోలోప‌ల ఏడవాల‌నిపించినా పైకి క‌న్నీళ్లు రావు.. చైతూ ఆవేద‌న‌!

2026-11-24 18:20 GMT

ఆ మూడు టేబుల్స్‌లో ప్రాఫిట్ టేబుల్ ఎంతో ముఖ్యం

2026-11-24 18:19 GMT

కథపై శేష్ పట్టు.. ఈసారి దర్శకుడికి ఫ్రీడమ్!

2026-11-24 18:19 GMT

భోగి వెనుక సంపత్ నంది చిన్ననాటి భయం!

2026-11-24 18:18 GMT

హైద‌రాబాద్‌లో వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్‌తో 'మెగా మ‌ల్టీప్లెక్స్'

2026-11-24 18:15 GMT

కూతురి కోసం తండ్రి పోరాటం.. 'నాన్నకుట్టి' ట్రైలర్ ఎలా ఉందంటే!

2026-11-24 18:14 GMT

King 100: క్రిస్మస్ డేట్‌పై నాగ్ పట్టు.. మారేది లేదట!

2026-11-24 18:10 GMT

బ్లూ అవుట్‌ఫిట్‌లో కొత్త ఫ్యాషన్ గోల్స్ సెట్ చేసిన పూజా హెగ్డే!

2026-11-24 18:10 GMT

RGV చ‌నిపోయినా అత‌డి ఆత్మ‌ను వెంటాడే క్లోన్ రెడీ అవుతోంది!

2026-11-24 18:03 GMT

మహేశ్ కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్.. బర్త్‌డే స్పెషల్!

2026-11-24 18:02 GMT

Copyright @2026

Powered by Blink CMS