కింగ్ సెంచరీ కూడా స్లోగానే!
టాలీవుడ్‌లో హీరోలు వందో సినిమాను ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈనేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కచ్చితంగా హింట్ కంటెంట్ తో మాత్రమే రావాలి? అన్న ఆసక్తిని చూపిస్తుంటారు.
టాలీవుడ్‌లో హీరోలు వందో సినిమాను ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఈనేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కచ్చితంగా హింట్ కంటెంట్ తో మాత్రమే రావాలి? అన్న ఆసక్తిని చూపిస్తుంటారు. అందులో భాగంగానే కింగ్ నాగార్జున కెరీర్‌లోని సెంచరీ మూవీపై ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెట్స్‌పైనే ఉంది. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లి ఇప్పటికే నెలలు గడుస్తున్నా? షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఈ విషయంలో నాగార్జున కూడా దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. నాగ్ ఏమాత్రం తొందర పడటం లేదు.
షూటింగ్ త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో నాణ్యతను కోల్పోవడం ఇష్టం లేక, ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. కంగారు పడకుండా ప్రశాంతంగా పూర్తి చేసి, ప్రేక్ష కాభిమానులకు అద్భుతమైన హిట్ సినిమాను మాత్రమే అందించాలనే దృఢ సంకల్పంతో పని చేస్తున్నారు. రా కార్తీక్ కూడా నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో అందంగా మలుస్తున్నాడని టీమ్ చెబుతుంది. ల్యాండ్ మార్క్ చిత్రానికి ఎలాంటి కంటెంట్ కావాలో? అలాంటి కంటెంట్ తోనే ఏమాత్రం రాజీ పడకుండా పని చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సినిమా నిర్మాణంలో ఇలాంటి సుదీర్ఘమైన షెడ్యూల్స్, పర్ఫెక్షన్ కోసం సమయం తీసుకోవడం అనేది సహజమైన విషయమే. నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరో తన అనుభమంతా రంగరించి సినిమాను తెరకెక్కిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అక్కినేని అభిమానులు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నా? సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. వేగం కంటే నాణ్యతే ముఖ్యమని నమ్మే నాగార్జున ఈ చిత్రంతో మరోసారి తన మార్క్ ఎంటర్‌టైనర్‌ను ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
సెట్స్‌లో జరుగుతున్న ఆలస్యం సినిమాలోని కంటెంట్ బలాన్ని మరింత పెంచుతుందని వెండితెరపై మ్యాజిక్ చూడటానికి తగిన సమయం పడుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ అడుగు లెక్కలేసుకుని వేస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కెరీర్ గ్రాఫ్‌లో ఈ సినిమా చిరస్థాయిగా నిలపాలని భావిస్తున్నారు. అందుకే నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, ప్రతి టెక్నీషియన్‌తో సమన్వయం చేసుకుంటూ ముందు కెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగే జాప్యాన్ని అభిమానులు కూడా అర్థం చేసుకుని విజయంపైనే పూర్తి దృష్టి పెట్టారు.
షూటింగ్ నెమ్మదిగా సాగుతున్నా? వచ్చే ఫలితం మాత్రం కచ్చితంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని నాగ్ సన్నిహిత వర్గాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా పక్కా స్క్రిప్ట్ ..క్వాలిటీతో సినిమా వస్తుందని.. విజయం అక్కినేని అభిమానులకు గొప్ప కానుకగా నిలవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే నాగ్ అండ్ కో ఆనందానికి అవధులుండవ్. ఇప్పటికే నాగచైతన్య `తండేల్` తో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెటారు. ఇటీవలే విడదులైన `లెనిన్` తో అఖిల్ కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు. నాగ్ కూడా సెంచరీ తో 100 కోట్ల క్లబ్ లో చేరితో అంతకు మించిన కోరిక ఇంకేముంటుంది.