రాకా నటీనటుల రెమ్యూనరేషన్.. ఈసారి అల్లు అర్జున్కి ఎంతంటే?
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ 'పుష్ప 2'తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ 'పుష్ప 2'తో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇప్పుడు అందరి చూపు రాకా మూవీ పైనే. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ సుమారుగా 800 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం ఇది. అల్లు అర్జున్ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆమె విలన్ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రోజుకు ఒక ఆసక్తికర విషయం అభిమానులలో అంచనాలు పెంచేస్తోంది. ఇకపోతే కళానిధి సినిమా అంటే కచ్చితంగా అది భారీ బడ్జెట్ మాత్రమే కాదు అత్యున్నత ప్రామాణాలతో రూపొందే మూవీ అని చెప్పడంలో సందేహం లేదు.
సినిమాకు ఏ రేంజ్ లో అయితే ఖర్చు పెడుతున్నారో.. అదే రేంజిలో నటీనటులు రెమ్యూనరేషన్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ పెట్టి చూస్తే.. నటీనటుల రెమ్యూనరేషన్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఈసారి అల్లు అర్జున్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తోంది. మరి ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తున్న నటీనటులు ఎవరు? వారి రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న నేపథ్యంలో సుమారుగా 175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఆయన కెరియర్ లోనే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించబోతున్నారు. ముఖ్యంగా 175 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో కూడా ఆయన వాటా తీసుకోనున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకుంటున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నందుకు ఏకంగా 25 కోట్ల మేరా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో రష్మిక విలన్ పాత్ర పోషిస్తుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరొకవైపు , తన పాత్రను, సినిమా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని ఆమె కూడా ఏకంగా 9 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ చిత్రానికి కర్త కర్మ క్రియ అయిన డైరెక్టర్ అట్లీ కుమార్ ఏకంగా 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నటీనటుల రెమ్యూనరేషన్లతో పాటు సినిమా ఖర్చు మొత్తంగా రూ.1000 కోట్లు అన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 1000 కోట్ల బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.