ది ప్యారడైజ్.. సీఎంను అడిగినా పర్మిషన్ ఇచ్చేది పోలీసులే..

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే.

Update: 2026-09-23 05:12 GMT

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే. ఇక మరికొన్ని గంటల్లో అంటే ఒకరోజు ముందే 23వ తేదీన ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఆ ప్రీమియర్‌ను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రేక్షకులతో కలిసి చూడాలని నాని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో రిక్వెస్ట్ పెట్టారు.




 


థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడటం తనకు చిన్నప్పటి నుంచి ఇష్టమని నాని తన పోస్టులో చెప్పారు. హైదరాబాద్‌లో ఆ అనుభవానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ది ప్యారడైజ్‌ను ఎవరి కోసం తీశామో వాళ్ల మధ్య కూర్చుని సినిమా చూడాలని ఉందని, వారి రెస్పాన్స్‌ను అక్కడే చూడాలనుకుంటున్నట్లు అన్నారు.

ఈ విజిట్‌కు అనుమతి ఇస్తే ప్రభుత్వం సూచించిన ప్రోటోకాల్స్, సేఫ్టీ గైడ్‌లైన్స్ అన్నీ పాటిస్తామని నాని ముందుగానే చెప్పారు. గతంలో పుష్ప 2 ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన తర్వాత, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో స్టార్ హీరోల థియేటర్ విజిట్స్ విషయంలో భద్రత ప్రధాన అంశంగా మారింది. ఆ ఘటన తర్వాత ఇలాంటి విజిట్స్‌ మరింత సీరియస్ గా మారాయి. అందుకే నాని కూడా ముందే అధికారికంగా పర్మిషన్ కోరారు.

నాని రిక్వెస్ట్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా నిబంధనలను గౌరవిస్తూ ముందుకు రావడాన్ని అభినందించారు. శ్రీకాంత్ ఓదెలను యంగ్ తెలంగాణ డైరెక్టర్‌గా ప్రస్తావిస్తూ, ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా కోసం నాని చూపిస్తున్న కమిట్‌మెంట్‌ను కూడా మెచ్చుకున్నారు. పర్మిషన్ కోసం ఏం చేయాలో కూడా తన రిప్లైలో క్లియర్‌గా చెప్పారు.

క్రౌడ్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా సంబంధిత లోకల్ పోలీస్ స్టేషన్‌కు అధికారికంగా అప్లికేషన్ ఇవ్వాలని సీఎం సూచించారు. ఆ అప్లికేషన్‌ను అక్కడి పోలీస్ టీమ్ పరిశీలించి, పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తన పోస్టులో తెలంగాణ డీజీపీని కూడా ట్యాగ్ చేశారు. అంటే నాని విజిట్‌కు నేరుగా సీఎం నుంచి అనుమతి కాకుండా, లోకల్ పోలీసుల క్లియరెన్స్ అవసరం. థియేటర్ వద్ద ఎంతమంది చేరే అవకాశం ఉంది, ఎలాంటి బందోబస్తు కావాలి అనే అంశాలు పోలీసులు పరిశీలిస్తారు.

ఇప్పుడు నాని టీమ్ నుంచి అధికారిక అప్లికేషన్ వెళ్లాల్సి ఉంది. సెప్టెంబర్ 23నే ప్రీమియర్ ఉండటంతో క్రౌడ్ కంట్రోల్, సెక్యూరిటీ ఏర్పాట్లు, థియేటర్ పరిసరాల పరిస్థితిని చూసిన తర్వాత పోలీసులు నిర్ణయం తీసుకుంటారు. పర్మిషన్ వస్తే నాని ప్రేక్షకులతో కలిసి ప్రీమియర్ చూడొచ్చు. లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విజిట్ ప్లాన్‌లో మార్పు చేయాల్సి ఉంటుంది. ఇక నానికి ఆ అనుమతులు ఏ విధంగా లభిస్తాయో చూడాలి.

Tags:    

Similar News