మానిప్యులేషన్ తో త్రిగుణ్, సింపతీ తో సుధీర్

అసలు ఈ వారం నామినేషన్స్లో త్రిగుణ్‌ ని నామినేట్ చేసింది ఒకళ్ళే. కానీ త్రిగుణ్‌ స్క్రీన్ ని క్యాప్చర్ వేసిన విధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండింది.

Update: 2026-09-23 03:31 GMT

బిగ్ బాస్ టీవీ షో లో మొదటి వారం నుంచి త్రిగున్ దూసుకుపుతున్న విషయం మనకి తెల్సిందే. ప్రస్తుత బిగ్‌బాస్ సీజన్‌లో త్రిగుణ్ తిరుగులేని స్టార్ ప్లేయర్‌గా దూసుకు పోతున్నాడు. మొదటి రోజు నుంచే రోహిత్‌తో వైరాన్ని మొదలు పెట్టి, తన ప్రధాన పోరు ఎవరితోనో స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. తోటి కంటెస్టెంట్లను మ్యానిపులేట్ చేస్తూనే ఉంటానని నామినేషన్లలో బాహాటంగానే ఒప్పుకోవడమే కాకుండా, చెప్పిన మాట ప్రకారమే నడుచుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు.

మొదట్లో త్రిగుణ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, రోహిత్ విషయంలో అనవసర ఘర్షణలు తగ్గించుకోవడంతో ఆ నెగెటివిటీ క్రమంగా సమసిపోయింది. పైగా ఈ వారం రోహిత్ నామినేషన్లలో లేకపోవడం త్రిగుణ్‌కు మరింత కలిసొచ్చి టాప్ పొజిషన్‌లో కొనసాగేలా చేస్తోంది. ఏదేమైనా ఈ వారం ఆటతో తనను తాను తిరుగులేని స్టార్‌గా నిలబెట్టుకునేందుకు త్రిగుణ్‌కు మంచి వేదిక దొరికింది. ప్రస్తుతానికి వోటింగ్ లో త్రిగుణ్‌ మొదటి స్థానం లో ఉన్నాడు. రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా త్రిగుణ్ జట్టులో చేరితే, అది వారికి కూడా ఊహించని రీతిలో లాభించవచ్చు.

అసలు ఈ వారం నామినేషన్స్లో త్రిగుణ్‌ ని నామినేట్ చేసింది ఒకళ్ళే. కానీ త్రిగుణ్‌ స్క్రీన్ ని క్యాప్చర్ వేసిన విధానం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉండింది. ముందు నుంచి సృష్టి ని సుధీర్ మీదకి ఉసిగొల్పుతూ నామినేషన్స్ లో మళ్ళీ తన మానిప్యులేటర్ పాత్రని పక్కాగా పోషించాడు.

సుధీర్ విషయంలో హద్దులు దాటి ప్రవర్తించిన సృష్టి ఈ వారం నామినేషన్ల నుంచి తృటిలో తప్పించుకుంది. లేదంటే ఆమె ఎలిమినేషన్ ఖాయమై ఉండేది; అయితే నామినేషన్స్ తప్పినా వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున చేతిలో ఆమెకు గట్టి మొట్టికాయలు పడటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. సృష్టి ఇలా బిహేవ్ చేసినప్పటికీ, సుధీర్ కి సింపతీ విపరీతంగా పెరుగుతుంది. ఈ వారం కనుక సృష్టి ఇలాగే సుధీర్ తో గొడవ పెంచుకుంటే, కచ్చితంగా సుధీర్ కి మంచి మైలేజ్ వస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు.

Tags:    

Similar News