ప్యారడైజ్: ఓవర్సీస్ లో స్పెషల్ ట్రీట్.. బుకింగ్స్ ట్రెండ్స్ ఇలా..
ఇప్పుడు నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 1.1 మిలియన్ డాలర్లను దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సూపర్ హైప్ కనిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు రోజు అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఓవర్సీస్ లో కూడా అంతే. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుండగా, ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ దక్కనుంది. .
అయితే ప్యారడైజ్ తెలుగు వెర్షన్ కు సెన్సార్ బోర్డు పలు కట్స్ సజ్జెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 21 కట్స్ చెప్పినట్లు సమాచారం. కొన్ని డైలాగ్స్, సీన్స్ లో మార్పులు చేయాలని సెన్సార్ సూచించింది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఆ ఛేంజెస్ లేకుండానే సినిమాను వేయనున్నారు. అంటే సెన్సార్ సూచించిన కట్స్ లేకుండా అన్ కట్ వెర్షన్ ను ప్రేక్షకులు చూడబోతున్నారు.
సాధారణంగా సినిమాల్లో సెన్సార్ కట్స్ లేదా డైలాగ్స్ కు బీప్స్, మ్యూట్స్ రావడం కొత్తేమీ కాదు. అయితే యాక్షన్ సినిమాల్లో ఇలాంటి ఛేంజెస్ వచ్చినప్పుడు కొన్ని సీన్స్ నేచురాలిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ది ప్యారడైజ్ విషయంలో అది మరింత ఇంట్రెస్ట్ పెంచుతోంది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఎలాంటి కట్స్, మ్యూట్స్ లేకుండా ఒరిజినల్ వెర్షన్ ను ప్రదర్శించడంతో అక్కడి ప్రేక్షకులకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ దక్కనుంది.
అయితే నార్త్ అమెరికాలో ది ప్యారడైజ్ మూవీని ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే ప్రీమియర్ షోల ప్రీ సేల్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పుడు నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 1.1 మిలియన్ డాలర్లను దాటినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్ లో సూపర్ హైప్ కనిపిస్తోంది.
మరోవైపు సినిమా కంటెంట్ డెలివరీ విషయంలో కూడా ఈసారి ఎలాంటి ఆలస్యం జరగలేదని తెలుస్తోంది. సాధారణంగా కొన్ని భారీ సినిమాలకు ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు లేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ ది ప్యారడైజ్ సెకండాఫ్ కంటెంట్ కూడా సరైన టైమ్ లో అందడంతో అమెరికాలో అనుకున్న సమయానికి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 23 బుధవారం సాయంత్రం అమెరికాలో ప్రీమియర్లు మొదలవుతుండగా.. ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లోనూ ప్రారంభం కానున్నాయి.
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపిస్తున్న రెస్పాన్స్, అన్ కట్ వెర్షన్ రిలీజ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఇక ఇప్పుడు అందరి చూపు ప్రీమియర్ షోలపైనే ఉంది. ఇంతటి హైప్ మధ్య సినిమా ఎలా ఉందన్నది తొలి షోతోనే తేలనుంది. ముఖ్యంగా నాని రా అండ్ రస్టిక్ లుక్, యాక్షన్, స్టోరీలోని ట్రీట్మెంట్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. హిట్ టాక్ వస్తే ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్యారడైజ్ సంచలనం సృష్టించడం ఖాయం.