క‌న్న కూతురికే సినిమా ఛాన్స్ ఇవ్వొద‌ని సూచించిన త‌ల్లి!

ఇండ‌స్ట్రీలో కుమార్తెల‌ స‌క్సెస్ కోసం త‌ల్ల‌లు ఎంత‌గా ప‌రిత‌పిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. కుమార్తె న‌టి అనే క‌ల‌ను నిజం చేయ‌డం కోసం త‌ల్లులు వారితో స‌మానంగా ప‌నిచేస్తారు.

Update: 2026-09-23 02:30 GMT

ఇండ‌స్ట్రీలో కుమార్తెల‌ స‌క్సెస్ కోసం త‌ల్ల‌లు ఎంత‌గా ప‌రిత‌పిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. కుమార్తె న‌టి అనే క‌ల‌ను నిజం చేయ‌డం కోసం త‌ల్లులు వారితో స‌మానంగా ప‌నిచేస్తారు. కానీ బాలీవుడ్ న‌టి రాణీముఖ‌ర్జీ త‌ల్లి గాయ‌ని కృష్ణ‌ ముఖర్జీ మాత్రం నా కుతుర్ని మీ సినిమాలో పెట్టుకుంటే ప్లాప్ అవుతుంద‌ని చెప్ప‌డం విడ్డూరం. విష‌యంలోకి వెళ్తే.. రాణి ముఖర్జీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే సమయంలో కూతురికే సినిమా అవకాశం ఇవ్వవద్దని ఓ నిర్మాతను తల్లి వారించిన ఆసక్తికర సంఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

1996లో రిలీజ్ అయిన `రాజా కి ఆయేగి బారాత్` చిత్రం తో రాణి ముఖర్జీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు రాణికి స్క్రీన్ టెస్ట్ నిర్వహించారు. ఆ స్క్రీన్ టెస్ట్‌లో రాణి నటన చూసిన తల్లి కృష్ణ ముఖర్జీ తీవ్ర అసంతృప్తి చెందారు. కూతురు అని మమకారంతో చూడకుండా నటిగా ఆమె ప్రదర్శన బాలేదని గ్రహించిన కృష్ణ ముఖర్జీ వెంటనే ఆ చిత్ర నిర్మాత సలీమ్ అక్తర్ వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ విష‌యాన్ఇస స్వ‌యంగా రాణీ ముఖ‌ర్జీ గుర్తు చేసుకున్నారు.

`నా తొలి స్క్రీన్ టెస్ట్ చూశాక మా అమ్మకు నా నటన అస్సలు నచ్చలేదు. దాంతో ఆమె నేరుగా నిర్మాత దగ్గరకు వెళ్లి నా కూతురిని హీరోయిన్‌గా పెడితే మీ సినిమా పాడైపోతుంది. మీకు భారీ నష్టాలు వస్తాయి. ఆమెను తీసుకోకపోవడమే మంచిది అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది` అని రాణి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నిర్మాత మాత్రం రాణిని నటిగా ఎంపిక చేయడానికే పట్టుదలతో ఉన్నారు. కృష్ణ ముఖర్జీ స్వయంగా బెంగాలీ చిత్రసీమలో ప్రసిద్ధ నేపథ్య గాయని ..ఆమె భర్త రామ్ ముఖర్జీ దర్శకుడు కావడంతో చిత్ర పరిశ్రమలోని మెళకువలు, నటనలోని నాణ్యత గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది.

ఈ నేప‌థ్యంలోనే కన్న కూతురనే పక్షపాతం చూపించ‌కుండా నటన రాని కూతురితో సినిమా తీసి నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నిజాయితీగా స్పందించార‌ని రాణి ముఖర్జీ కొనియాడారు. తల్లి హెచ్చరించినప్పటికీ, నిర్మాత సలీమ్ రాణిపై నమ్మకంతో `రాజా కి ఆయేగి బారాత్` లో అవకాశం ఇచ్చారు. సినిమా విడుద‌ల అనంత‌రం రాణి నటనతో అందరినీ ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఆమిర్ ఖాన్‌తో `గులామ్`, షారుఖ్ ఖాన్ , కాజోల్‌లతో కలిసి `కూచ్ కూచ్ హోతా హై` వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌లలో ఒకరిగా ఎదిగారు రాణీ ముఖ‌ర్జీ.

ఏది ఏమైనా? కూతురి విషయంలో స్వార్థం లేకుండా వ్యవహరించిన కృష్ణ ముఖర్జీ ప్రాక్టికల్ ఆలోచనా విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తల్లి చూపించిన నిజాయితీ, విమర్శలను స్వీకరించే తత్వమే రాణి ముఖర్జీని గొప్ప నటిగా తీర్చిదిద్దాయి. తల్లి అందించిన మార్గదర్శకత్వం, క్రమశిక్షణతోనే సినీ రంగాన ఈ స్థాయిలో నిలబడగలిగానని రాణి ముఖర్జీ ఎప్పుడూ చెబుతుంటారు.

Tags:    

Similar News