'ప్యారడైజ్' లో కాకులను ఎందుకు వాడారో తెలిసిపోయింది... వాటిని దానికి ప్రతీకగా చూస్తారా?
'దసర' సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల... ఇప్పటివరకు తన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి తన రెండో సినిమాగా చేస్తున్న 'ప్యారడైజ్' సినిమా మీద విశేషమైన అంచనాలు ఉన్నాయి.
'దసర' సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల... ఇప్పటివరకు తన చేసింది ఒక్క సినిమానే అయినప్పటికి తన రెండో సినిమాగా చేస్తున్న 'ప్యారడైజ్' సినిమా మీద విశేషమైన అంచనాలు ఉన్నాయి. ఒక స్టార్ డైరెక్టర్ కి ఏ రేంజ్ లో అయితే గుర్తింపు ఉంటుందో శ్రీకాంత్ కి ఇప్పుడు అదే రేంజ్ లో ఇమేజ్ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. నాని లాంటి స్టార్ హీరో శ్రీకాంత్ ఓదెలను నమ్మి తనకు రెండో అవకాశం ఇవ్వడం నిజంగా చాలా మంచి విషయం... ప్యారడైజ్ సినిమా ప్రీమియర్స్ ఈరోజు ఉండటంతో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టికెట్స్ మొత్తం హార్ట్ కేక్ ల అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులు సైతం ఈ సినిమాని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం విశేషం... ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మొదట రిలీజ్ అయిన గ్లింప్స్ లోనే హీరో అండ్ బ్యాచ్ ని కాకులతో పోలుస్తూ దర్శకుడు చూపించిన విధానం బాగుంది. దాని వెనక గల కారణం ఏంటి అంటే సినిమాలో కాకులను హైలెట్ చేసి చూపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మిగతా పక్షులతో పోలిస్తే కాకులను అణగారిన వర్గాలకు సింబల్ గా వాడుతుంటారు. ఇక కాకులను సైతం పెద్దగా ఎవరు పట్టించుకోరు. కాబట్టి వెనకబడిన కులాల వారిని సైతం ఎవరు పట్టించుకోరనే ఉద్దేశ్యంతో కాకులను అలా పోల్చుతూ ఉంటారు. దర్శకుడు సైతం ఈ సినిమాలో హీరో బ్యాచ్ ను అదే రేంజ్ లో చూపిస్తూ దాని మీదనే సినిమా కథని నడిపించినట్టుగా తెలుస్తుంది.
వెనుకబడిన వర్గాల వారిని ఎవరు పట్టించుకోనప్పుడు వాళ్ళు ఎలాంటి తిరుగుబాటు చేస్తారు. వాళ్ళకంటూ స్వేచ్ఛ స్వాతంత్యాలను ఎలా సంపాదించుకుంటారు అనే నేపథ్యంతోనే ఈ సినిమా తెరకెక్కినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ సినిమాతో శ్రీకాంత్ మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు... దసర లో సైతం దీక్షిత్ శెట్టి క్యారెక్టర్ మరణించిన తర్వాత తనకి పిండం పెట్టినప్పుడు మొదట కాకి ఆయన పిండాన్ని ముట్టదు. కానీ ఎప్పుడైతే నాని క్యారెక్టర్ కార్తీ సురేష్ కు పెండ్లి చేసుకుంటాడో అప్పుడు కాకి వచ్చి ఆ పిండాన్ని తింటుంది. అంటే దీక్షిత్ శెట్టి ఎమోషన్ ను శ్రీకాంత్ కాకి రూపం లో చూపించే ప్రయత్న చేశాడు.
ఇక ఈ సినిమాలో సైతం కాకులను రిప్రజెంట్ చేస్తూనే తను సినిమాను చేస్తున్నాడు. కాబట్టి ఈ మూవీ లో కూడా ఒక భారీ ఎమోషన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మరికొద్ది గంటల్లో ఈ సినిమా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు ట్రెండింగ్ గా నిలుస్తుంది. ఈ సినిమాతో అటు డైరెక్టర్ గా శ్రీకాంత్, ఇటు హీరోగా నాని ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ ని అందుకుంటారనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిందే...