రవితేజ - త్రివిక్రమ్ ఇద్దరు కలిసి ఆ హిట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారా...
రవితేజ - త్రివిక్రమ్ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీళ్ళిద్దరు ఒకే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ ఎక్కడ వెనక్కి తగ్గకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు. మాస్ మహారాజా గా తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి రవితేజ రీసెంట్ గా 'ఇరుముడి' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో 300 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన మరిన్ని డిఫరెంట్ సబ్జెక్టులను ఎంచుకోవడానికి సన్నాహాలు చేస్తుండడం విశేషం... ఇక రచయితగా తన కెరియర్ ను మొదలుపెట్టిన త్రివిక్రమ్ సైతం కెరియర్ మొదట్లో వైవిద్య భరితమైన కథలను అందించాడు. దానికి తగ్గట్టుగానే మాటలను చేకూర్చి సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో తను కీలకపాత్ర వహించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి తన సత్తా ఏంటో చూపించిన త్రివిక్రమ్ వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి పోస్టు ప్రొడక్షన్ వర్క్ లో తను బిజీగా ఉన్నాడు...
రవితేజ - త్రివిక్రమ్ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ వీళ్ళిద్దరు ఒకే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారనే విషయం మనలో చాలామందికి తెలియదు. కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు, సాక్షి శివానంద్ హీరో హీరోయిన్లుగా నటించిన 'సముద్రం' సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే అందులో ఒక చిన్న క్యారెక్టర్ లో కూడా నటించాడు. ఆ సమయంలో త్రివిక్రమ్ మాత్రం పోసాని కృష్ణ మురళి దగ్గర రైటర్ గా పనిచేశాడు. కానీ తను దర్శకుడు కావాలనే ఉద్దేశ్యంతో అక్కడ పని మానేసి కృష్ణ వంశీ దగ్గర సముద్రం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు.
ఆ క్రమంలో త్రివిక్రమ్ - రవితేజ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ గా కూడా మారిపోయారట. ఆ తర్వాత కాలంలో రవితేజ స్టార్ హీరోగా మారడం త్రివిక్రమ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోవడం జరిగాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అయితే రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం ఆ సినిమాకి మంచి క్రేజ్ ఉంటుంది. త్రివిక్రమ్ కామెడీ పంచ్ లు రాస్తే రవితేజ దాన్ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళగలడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక వీలైనంత తొందర్లోనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే చూడాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటున్నారు... ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రవితేజ కొడుకు త్రివిక్రమ్ కొడుకు ఇద్దరు కూడా సందీప్ రెడ్డివంగా చేస్తున్న 'స్పిరిట్' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తూ ఉండడం విశేషం...