లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!
| ‘రామాయణం’లో రావణుడి పాత్ర కోసం యశ్ భారీ కాస్ట్యూమ్స్ ధరించినట్లు డిజైనర్ సానియా సర్ధారియా వెల్లడించారు. సాధారణ సన్నివేశాల్లో దుస్తులు, ఆభరణాల బరువు 16 నుంచి 20 కిలోలు ఉండేదని, ప్రత్యేక సన్నివేశాల్లో 30-33 కిలోలకు చేరేదని తెలిపారు. ఇక రావణుడి కిరీటం బరువు 1.8 కిలోలని, ఇంతటి బరువుతోనూ యశ్ ఓపికగా షూటింగ్లో పాల్గొన్నారని ప్రశంసించారు.
ఇటీవలే బాలీవుడ్ `రామాయణం` మొదటి భాగం ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమాలో అన్ని పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. ప్రత్యేకించి లంకేశ్వరుడి పాత్ర పోషించిన పాన్ ఇండియా స్టార్ యశ్ పాత్ర క్రేజ్ మాత్రం మాములుగా లేదు. రాముడి పాత్రను మించి సినిమాలో ఈ పాత్ర హైలైట్ అవుతుంది. రావణాసురుడి ఆహార్యంలో అదరగొట్టాడు. ఈ పాత్ర కోసం యశ్ ఎంతో శ్రమించాడు. ఆ లుక్ కోసం ప్రత్యేకంగా వర్కౌట్లు చేసాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ పాత్రకు సంబంధించిన మేకోవర్ పై ఆసక్తిర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ పాత్ర కోసం యష్ ధరించిన దుస్తులు, ఆభరణాల బరువు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రకు కాస్ట్యూమ్ అండ్ స్టైలిస్ట్‌గా వ్యవహరించిన సానియా సర్ధారియా ఆ విషయాలు రివీల్ చేసారు.
సినిమాలో చాలా సన్నివేశాల్లో యష్ ధరించిన సాధారణ దుస్తులు .. జ్యువెలరీ బరువే 16 నుండి 20 కేజీల వరకు ఉండేదని తెలిపారు. లంకేశ్వరుడి రాజసానికీ, అసుర చక్రవర్తి గంభీర్యానికి తగ్గట్టుగా ఈ డిజైన్లు రూపొందించినట్లు పేర్కొన్నారు. అయితే కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాల్లో యష్ వేసుకున్న కాస్ట్యూమ్స్ బరువు ఏకంగా 30 -33 కేజీల వరకు పెరిగిందని కాస్ట్యూమ్ డిజైనర్ వెల్లడించారు.
ముఖ్యంగా లంకలో రాచరిక సన్నివేశాలు, వివాహ ఘట్టాలు, శూర్పణఖ పెళ్లి నేపథ్య సన్నివేశాల కోసం రూపొం దించిన భారీ రాయల్ అవుట్‌ఫిట్స్ అత్యంత బరువైనవిగా నిలిచాయని తెలిపారు. అంతటి భారీ బరువును మోస్తూ యష్ సెట్స్‌లో నటించడం యూనిట్ ని ఎంతగానో ఆకట్టుకుందన్నారు. అయితే మొత్తం కాస్ట్యూమ్స్ డిజైనింగ్‌లో అత్యంత క్లిష్టంగా మారిన అంశం రావణాసురుడి `కిరీటం` అని సానియా తెలిపారు. తలపై ధరించే కిరీటం ఎంత బరువుగా ఉంటే నటుడికి అంత ఇబ్బందికరంగా ఉంటుందని..అందుకని దాన్ని సాధ్యమైనంత తేలికగా చేయడానికి అనేక మార్గాలు అన్వేషించామన్నారు.
3డీ మోడల్స్ ద్వారా రకరకాల ప్రయోగాలు చేసినా? కిరీటం బరువును 1.8 కేజీల కంటే తగ్గించడం సాధ్యప డలేదన్నారు. అంత బరువైన కిరీటం 33 కేజీల దుస్తులు ధరించడం వల్ల శరీర కదలికలకు తీవ్రమైన పరిమితులు ఏర్పడినా? యష్ ఎంతో ఓర్పుతో నవ్వుతూ షూటింగ్లో పాల్గొన్నారని డిజైనర్ ప్రశంసించారు. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. సినిమాలో అన్ని పాత్రలు ఒక ఎత్తు అయితే? యశ్ పోషించిన రావణాసురిడి పాత్ర వాట న్నింటిని బీట్ చేసింది. ప్రతి నాయక పాత్ర అయినా? కథానుగుణంగా దర్శకుడు నితీష్ తివారీ ఆ పాత్రను తీర్చిదిద్దిన వైనం విమర్శకుల ప్రశంసలు అందుకునేలా చేసింది.