మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?
| హీరో కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2025 మేలో ఈ జంటకు మగబిడ్డ జన్మించాడు. అయితే రెండోసారి ప్రెగ్నెన్సీ వార్తలపై కిరణ్ దంపతులు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట మళ్లీ సంబరాలు మొదలయ్యాయా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. పెళ్లయిన ఏడాదికే మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పిన కిరణ్, రహస్య గోరఖ్ దంపతులు.. ఇప్పుడు రెండోసారి పేరెంట్స్ కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వార్తలో నిజమెంత అని ఫ్యాన్స్ ఆరా తీస్తూనే, ఈ క్యూట్ కపుల్‌కు అడ్వాన్స్‌గా విషెస్ చెబుతున్నారు..
వైరల్ అవుతున్న వార్తలో నిజమెంత? :
కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ ప్రస్తుతం రెండోసారి ప్రెగ్నెంట్ అని పలు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి. గతేడాది అంటే 2025 మే 23న ఈ జంటకు ఒక పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బాబుకు ఏడాది నిండగానే, ఇప్పుడు తమ రెండో సంతానాన్ని స్వాగతించడానికి వీళ్లు రెడీ అవుతున్నారట. అయితే ఈ విషయంపై కిరణ్ అబ్బవరం నుండి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
రహస్యంగా ప్రేమ.. గ్రాండ్‌గా పెళ్లి:
2019లో వచ్చిన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు కిరణ్. ఆ మూవీలో హీరోయిన్గా చేసిన రహస్యతోనే ఆయన ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్ల పాటు వీళ్ల లవ్ స్టోరీ ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా నడిచింది. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యాక గానీ వీళ్ల ప్రేమ విషయం బయటకు రాలేదు. ఇక చివరకు 2024 ఆగస్టు 22న వీళ్ల పెళ్లి గ్రాండ్‌గా జరిగింది.
పర్సనల్ లైఫ్‌తో పాటు కెరీర్ కూడా సూపర్ :
పెళ్లి తర్వాత కిరణ్ నటించిన ‘క’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్‌లో రహస్య కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. ఇక ఒకవైపు ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో కిరణ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ గుడ్ న్యూస్ తెలిసినప్పటి నుండి ఇండస్ట్రీ వాళ్లు, నెటిజన్లు కిరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
డైరెక్టర్‌గా మారిన కిరణ్.. కొత్త సినిమాలివే:
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన స్వీయ దర్శకత్వంలో ‘రియాలిటీ’ అనే సినిమా చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఇందులో ‘ఆనందం’ అనే మిడిల్ క్లాస్ హోటల్ మేనేజర్‌గా కిరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ ఐన మొదటి పాట 'భజగోవిందం' ఆడియన్స్ ను అలరిస్తుంది. ఇక భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా, క్రిస్మస్ కానుకగా 2026 డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత ‘ఇంద్రపుత్ర’ అనే పాన్ ఇండియా ఫాంటసీ మూవీ కూడా లైన్లో ఉంది.
ఒకవైపు డైరెక్టర్‌గా, హీరోగా కెరీర్లో దూసుకుపోతూనే.. మరోవైపు పర్సనల్ లైఫ్‌లోనూ కిరణ్ అబ్బవరం డబుల్ హ్యాపీనెస్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ రెండో బిడ్డ వార్తపై కిరణ్ దంపతులు ఎప్పుడు అఫీషియల్‌గా స్పందిస్తారో చూడాలి.