హీరోయిన్ కు స‌హ‌నాన్ని నేర్పిన డైరెక్ట‌ర్

సాధారణంగా ఒక సీన్ ను పూర్తి చేసిన తర్వాత నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌పై ఒక అంచనాకు వస్తారు. డైరెక్ట‌ర్ కూడా ఓకే చెప్పడంతో తమ పని పూర్తైంద‌ని భావిస్తారు.

Update: 2026-09-23 07:54 GMT

సినిమా షూటింగ్ అంటే ముందే రాసుకున్న సీన్స్ ను కెమెరా ముందుకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. కొంతమంది డైరెక్ట‌ర్ల‌ విషయంలో అసలు క్రియేటివిటీ కెమెరా ఆన్ అయిన తర్వాతే మొదలవుతుంది. ది ప్యారడైజ్ విషయంలో శ్రీకాంత్ ఓదెల వర్కింగ్ స్టైల్ చూస్తే ఇదే అనిపిస్తోందని హీరోయిన్ కాయదు లోహర్ చేసిన కామెంట్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఒక సీన్ పూర్తైంద‌ని నటీనటులు అనుకునే టైమ్ కు డైరెక్టర్ ఆలోచన మరో దిశలోకి వెళ్లడం ఈ సినిమా మేకింగ్‌లో ప్రత్యేకమైన అంశంగా కనిపిస్తోంది.

సాధారణంగా ఒక సీన్ ను పూర్తి చేసిన తర్వాత నటీనటులు తమ పెర్ఫార్మెన్స్‌పై ఒక అంచనాకు వస్తారు. డైరెక్ట‌ర్ కూడా ఓకే చెప్పడంతో తమ పని పూర్తైంద‌ని భావిస్తారు. కానీ శ్రీకాంత్ ఓదెల విషయంలో పరిస్థితి మరోలా ఉంటుందని కాయదు మాటలు సూచిస్తున్నాయి. ఒక సీన్‌ను తాము బాగా చేశామని అనుకున్న తర్వాత కూడా ఆయన అదే సీన్ ను మ‌రో విధంగా చూడటం, నటీనటుల నుంచి మ‌రో రకమైన ఎక్స్‌ప్రెషన్ లేదా పెర్ఫార్మెన్స్ రాబట్టేందుకు ప్రయత్నించడం ఆయన మేకింగ్‌లో భాగంగా కనిపిస్తోంది. అంటే నటుడు ఇచ్చిన అవుట్‌పుట్‌తో శాటిస్‌ఫై అవ‌డం కంటే, తన ఊహలో ఉన్న సీన్ స్క్రీన్ పై కనిపించే వరకు శ్రీకాంత్ కాంప్ర‌మైజ్ అవ‌డ‌ని అర్థ‌మ‌వుతుంది.

ఇక్కడే మ‌రో ఇంట్రెస్టింగ్ క్వ‌శ్చ‌న్ మొదలవుతోంది. శ్రీకాంత్ ఓదెల సినిమాను ముందే పూర్తిగా ప్లాన్ చేసుకుంటారా? లేక సెట్లో నటీనటులతో పనిచేస్తున్న టైమ్ లోనే సీన్ కు కొత్త రూపాన్ని ఇస్తారా? కాయదు చెప్పిన అనుభవాన్ని పరిశీలిస్తే రెండో విధానానికి కొంత ప్రాధాన్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ముందుగా అనుకున్న దానికంటే కెమెరా ముందు కనిపించే పెర్ఫార్మెన్స్, ఆ మూమెంట్ లోని వాతావరణం, నటీనటుల బాడీ లాంగ్వేజ్ వంటివి ఆయన ఆలోచనను మార్చే అవకాశం ఉన్నట్లు ఆమె మాటలు చెబుతున్నాయి.

అందుకే ది ప్యారడైజ్ సినిమాలో యాక్ట్ చేయ‌డం కాయదుకు కేవలం మరో సినిమా ఎక్స్‌పీరియెన్స్ గా మిగలలేదని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఏ సీన్ అనుకున్నంత ఈజీగా పూర్తికాలేద‌ని, డైరెక్ట‌ర్ ఆలోచన ఎప్పుడు మారుతుందో చెప్పలేమ‌ని, ఫైన‌ల్ రిజ‌ల్ట్ కోసం ఓపికగా ఎదురుచూడాల్సి వ‌చ్చింద‌ని, ఈ ప్రక్రియ మొత్తం తనకు సహనాన్ని నేర్పిందని క‌యాదు చెప్పారు.

స్క్రీన్ పై కొన్ని నిమిషాలు కనిపించే సీన్ వెనుక ఎన్ని ఆలోచనలు, ఎన్ని మార్పులు, ఎన్ని ప్రయత్నాలుంటాయో ఆడియ‌న్స్ కు తెలియదు. ది ప్యారడైజ్ విషయంలో మాత్రం ఆ తెరవెనుక ప్రయాణం కూడా సినిమాకు ఉన్నంత ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీకాంత్ ఓదెలకు సీన్ అంటే ఒకసారి షూట్ చేసి ముగించేసే వ్యవహారం కాదని, అది కెమెరా ముందు రూపం దాల్చే వరకు రెగ్యుల‌ర్ గా మారే క్రియేటివ్ ప్రాసెస్ గా భావిస్తున్నారనే డిస్క‌ష‌న్ కు కాయదు కామెంట్స్ కారణమవుతున్నాయి.

Tags:    

Similar News