ప్యారడైజ్ టికెట్ రేట్లు.. హైకోర్టు బిగ్ ట్విస్ట్..
థియేటర్లలో సందడి చేయడానికి నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ రెడీ అవుతుంటే.. టికెట్ రేట్ల విషయంలో హైకోర్టు ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
థియేటర్లలో సందడి చేయడానికి నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ రెడీ అవుతుంటే.. టికెట్ రేట్ల విషయంలో హైకోర్టు ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన నాని సినిమాకు రేట్లు పెంచుతూ ఇచ్చిన పర్మిషన్ పై హైకోర్టు లేటెస్ట్ గా రెస్పాండ్ అయింది. ప్యారడైజ్ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఇచ్చిన మెమోను మరోసారి రివ్యూ చేయాలని సజ్జెస్ట్ చేసింది.
అవసరమైతే ఆ మెమోను వెనక్కి తీసుకునే విషయాన్ని పరిశీలించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి క్లారిటీ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు టికెట్ రేట్ల వ్యవహారం ఇంట్రెస్టింగ్ గా మారింది. సెప్టెంబర్ 24వ తేదీన ప్యారడైజ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి ముందు రోజు అంటే బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రీమియర్ షో వేసుకునేందుకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీనిపై ఓ న్యాయవాది హైకోర్టును రీసెంట్ గా ఆశ్రయించారు. టికెట్ రేట్ల పెంపునకు ఇచ్చిన మెమో నిబంధనలు, గతంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కు విరుద్ధంగా ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై జస్టిస్ ఎన్.వి.శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 77లోని నిబంధనల కోసం మాట్లాడారు.
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు టికెట్ రేట్ల పెంపునకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. ముఖ్యంగా కార్మికుల వెల్ఫేర్ కు సంబంధించిన నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఆ నిబంధనలు పాటించినట్లు చూపించే వివరాలు లేకుండానే ది ప్యారడైజ్ కు రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.
అదే సమయంలో టికెట్ ధరల పెంపునకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆర్డర్లు కూడా హైకోర్టు గుర్తుచేసింది. సినిమా విడుదలకు 90 రోజుల ముందు టికెట్ ధరల పెంపునకు సంబంధించిన ప్రపోజల్ ఇవ్వాలని పేర్కొంది. ఆ ప్రపోజల్ ను ప్రజలకు అందుబాటులో ఉంచితే అబ్జెక్షన్ ఉంటే చెప్పే ఛాన్స్ ఉంటుందని తెలిపింది. కానీ సినిమాలు విడుదలకు రెండు, మూడు రోజుల ముందు టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వడం అలవాటుగా మారిందని చెప్పింది.
ఇలాంటి నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు వచ్చేలోపే టికెట్లు సేల్ అయిపోతున్నాయని పేర్కొంది. ఆ విధానం కంటిన్యూ అవ్వడం కరెక్ట్ కాదని వ్యాఖ్యానించింది. దీంతో ప్యారడైజ్ మూవీకి ఇచ్చిన టికెట్ ధరల పెంపు మెమోను రివ్యూ చేయాలని కోర్టు సజ్జెస్ట్ చేసింది. దాన్ని వెనక్కి తీసుకోవాలా? వద్దా? అనే నిర్ణయాన్ని హోంశాఖ ముఖ్య కార్యదర్శికే వదిలేసింది. ఆ తర్వాత నెక్స్ట్ విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. దీంతో మరికొన్ని గంటల్లో విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. ది ప్యారడైజ్ టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.