28 ఏళ్ల గ్యాప్ తర్వాత మ్యాజిక్ కాంబో… ‘కింగ్ 100’ మూవీలో టబు ఎంట్రీ!

గతంలో నాగార్జున, టబు కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్ మూవీస్ నిన్నేపెళ్లాడట, ఆవిడా మా ఆవిడే, ఇలా ఎన్నో గుర్తొస్తాయి.

Update: 2026-07-06 07:56 GMT

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ చిత్రం (కింగ్ 100) ఈ మూవీ గురించి వస్తున్న ఒక్కో అప్‌డేట్ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. ముఖ్యంగా నాగార్జున సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అలనాటి అందాల తార టబు.. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత మళ్లీ నాగ్ సరసన ఈ సినిమాలో కనిపించబోతోందనే వార్త టాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది. అయితే ఈసారి ఆమె రోల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని టాక్. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..

ఊహించని రోల్‌లో కనిపించనున్న టబు:

గతంలో నాగార్జున, టబు కాంబినేషన్ అనగానే ప్రేక్షకులకు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సీన్స్ మూవీస్ నిన్నేపెళ్లాడట, ఆవిడా మా ఆవిడే, ఇలా ఎన్నో గుర్తొస్తాయి. అప్పట్లో వీరిద్దరికీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన అభిమాన వర్గం ఉంది. అయితే, ఈ 100వ సినిమాలో టబు హీరోయిన్‌గా కాకుండా.. నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ ప్రతినాయిక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లూ వీరిని లవర్స్‌గా చూసిన ఆడియన్స్‌కు.. ఇప్పుడు నాగ్‌కు అపోజిట్‌గా టబు విలనిజం చూపించబోతోందనే బజ్ సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేసింది.

కథేంటి.. ఎవరి దర్శకత్వం?:

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. పేదరికం నుంచి స్వయంకృషితో ఒక పెద్ద సంపన్నుడిగా ఎదిగిన ఓ వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందట. ఇక ఇందులో తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ అని తెలుస్తోంది. అలాగే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సుష్మిత భట్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా శరవేగంగా సాగుతోంది.

జూలై 10 తర్వాతే అసలైన అప్‌డేట్:

తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నాగార్జున.. తన 100వ సినిమా గురించి ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే హామీ ఇచ్చారు. జూలై 10 తర్వాత ‘కింగ్ 100’కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ ఇస్తానని ఆయన ప్రకటించారు. ఇక దీంతో జూలై మధ్య వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన అసలైన వివరాలు, అలాగే టబు క్యారెక్టర్‌పై వస్తున్న వార్తల్లో నిజమెంత అనే విషయాలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

బాక్సాఫీస్ దగ్గర కింగ్ మార్క్ ర్యాంపేజ్:

నాగార్జున తన కెరీర్‌లో ఎన్నో మైల్ స్టోన్ సినిమాలు చేశారు. ఇప్పుడు రాబోతున్న ఈ 100వ సినిమా ఆయనకు మరింత స్పెషల్. 28 ఏళ్ల తర్వాత టబు లాంటి వెర్సటైల్ యాక్ట్రెస్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం, అది కూడా విలన్ పాత్ర అనగానే అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లిపోయాయి. ఇక అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఇండస్ట్రీ బజ్ అయినప్పటికీ.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలో నాగ్, టబుల మైండ్ బ్లోయింగ్ పర్‌ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ దగ్గర కింగ్ మార్క్ ర్యాంపేజ్ చూడటం ఖాయం..

Tags:    

Similar News