NC24: ఇప్పుడే ఈ రేంజ్ లో ఉందంటే..
తాజాగా విడుదల చేసిన ప్రీ-ప్రొడక్షన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.;
యువసామ్రాట్ నాగచైతన్య కెరీర్‌లో 'తండేల్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తన కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా తర్వాత.. చైతూ మరోసారి బిగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే 'NC24'. ఎనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గర నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇప్పుడు రిలీజైన మేకింగ్ గ్లింప్స్ చూసిన తర్వాత.. ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి రెట్టింపైంది.
ఈ సినిమాకు 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈసారి చైతూ మిస్టరీ హంట్ థ్రిల్లర్ జానర్‌లోకి అడుగుపెడుతున్నారు. దేవాలయాల మిస్టరీలు, పురాతన రహస్యాలపై కథ నడవనుందని సమాచారం. చైతూ కూడా తన పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నిటికంటే ఈ రోల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, కొత్త కోణంలో కనిపించబోతున్నాడని సినీ వర్గాల టాక్.
సాధారణంగా తెలుగు సినిమాల్లో ఇలాంటి మిస్టరీ థ్రిల్లర్స్ చాలా తక్కువగా ఉంటాయి. అయితే 'NC24' కోసం దర్శకుడు కార్తీక్ దండు పెద్ద ఎత్తున ప్రిపరేషన్ చేశారు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యేలోపే రీసెర్చ్, రిహార్సల్స్, ప్రీ-విజువలైజేషన్ పనులు భారీగా జరిగాయి. హాలీవుడ్ తరహాలో వందశాతం ప్రిపేర్ అయిపోయిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాలన్నది మేకర్స్ ప్లాన్. ఆ మేకింగ్ వీడియో చూసినవాళ్లు కూడా ఇదొక అంతర్జాతీయ స్థాయి సినిమా అవుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా విడుదల చేసిన ప్రీ-ప్రొడక్షన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. నాగచైతన్య లుక్, సెట్స్ డిజైన్, కథపై వదిలిన చిన్న హింట్స్.. అన్ని కలిసి ప్రేక్షకుల్లో ఊహాగానాలు పెంచేశాయి. రహస్యాల చుట్టూ తిరిగే కథ కావడం, కొత్తదనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పటికే వందలాది మిమ్స్, ఫ్యాన్ ఆర్ట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా కథను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. 'తండేల్' సక్సెస్ తర్వాత చైతూ నుండి వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా NC24 పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఇంత హైప్ వచ్చిందంటే.. టీజర్, ట్రైలర్ వచ్చాక ఇంకెంత మాస్ క్రేజ్ ఉంటుందో ఊహించుకోవచ్చు.