ప‌ప్పు ట‌మోటాతో హ‌బ్బీకి బోర్ కొట్టించేస్తోందే

ఇంట్లో న‌య‌న్ వంట గ‌దిలో ఉంటే మాత్రం లంచ్, డిన్న‌ర్ లో కచ్చితంగా ప‌ప్పు ట‌మోటా ఉండాల్సిందేట‌. తానే స్వ‌యంగా త‌యారు చేస్తుందిట‌.;

Update: 2026-02-27 15:30 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార నిత్యం షూటింగ్ ల‌తో బిజీ. ఉంటే ఆన్ సెట్స్ లో ఉంటుంది లేదా? ఇంట్లో పిల్లల‌తోనే స‌మ‌యం గ‌డుపుతుంది. అంత‌కు మించి న‌య‌న్ మ‌రే వేప‌కాలు పెట్టుకోదు. వెకేష‌న్ల‌కు వెళ్ల‌డం చాలా అరుదు. మ‌రి ఈ బ్యూటీ మంచి వంట‌గ‌త్తే అన్న సంగ‌తి ఎంత మందికి తెలుసు? అవును అంతా అనుకుం టున్న‌ట్లు న‌య‌న‌తార కేవ‌లం వండిన ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకునే టైపు కాదు. అవ‌స‌ర‌మైతే గ‌రిట ప‌ట్టి గుభాళింపును తీసుకు రాగ‌ల‌దు. వంట చేయ‌డం అంటే న‌య‌న‌తార అమితంగా ఇష్ట‌ప‌డుతుందిట‌.

త‌న కోసం కాకుండా ఇత‌రుల కోసం వండ‌టాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తోందిట‌. ఎలాంటి షూటింగ్స్ లేని సమ యంలో ఆమె ఇంట్లో వంటలు చేస్తుంటారు. న‌య‌న‌తార కేర‌ళ‌కు చెందిన న‌టి కావ‌డంతో కేర‌ళ స్టైల్ వంట‌కాలు అద్భు తంగా చేస్తుందిట‌. కేర‌ళ స్టైల్ ఫిష్ కర్రీ, అప్పం వంటివి చేయ‌డంలో స్పెష‌లిస్ట్ అట‌. పిల్లల కోసం ప్రత్యేక మైన ఆహార పదార్థాలను స్వయంగా త‌యారు చేస్తుందిట‌. ఒక‌వేళ వంట మ‌నిషి చేసినా అందుబాటులో ఉన్న స‌మ‌యంలో వాటిని ఎంతో నిశితంగా ప‌రిశీలిస్తుందిట‌. మ‌రి భ‌ర్త విగ్నేష్ శివ‌న్ కు అమ్మ‌డు ప్రియంగా చేసే వంట‌కం ఏది? అంటే ప‌ప్పు ట‌మోటో అట‌.

ఇంట్లో న‌య‌న్ వంట గ‌దిలో ఉంటే మాత్రం లంచ్, డిన్న‌ర్ లో కచ్చితంగా ప‌ప్పు ట‌మోటా ఉండాల్సిందేట‌. తానే స్వ‌యంగా త‌యారు చేస్తుందిట‌. మిగ‌తా వంట‌కాల‌న్నీ వంట మ‌నిషి చేసినా? ప‌ప్పు ట‌మోటో విష‌యంలో మాత్రం తానే ఎంట‌ర్ అయి స్వ‌యంగా త‌యారు చేస్తుందిట‌. వంట మ‌నిషి చేస్తాన‌న్నా? నో నో అనేస్తుందిట‌. ఇలా న‌య‌న్ ఇంట్లో ఉన్న ప్ర‌తీసారి ప‌ప్పు త‌ప్ప‌నిస‌రి అట‌. ఇలా ప‌ప్పు తిని తిని విగ్నేష్ శివ‌న్ కూడా చాలా సార్లు విసుగు చెందా డుట‌. ప్లీజ్ ప‌ప్పు వ‌ద్దు? మ‌రో కొత్త వంటకం ట్రై చేయ్ అన్నా? కొత్త‌వి ప్ర‌య‌త్నిస్తాను. కానీ ప‌ప్పు మాత్రం కామ‌న్ గా తాను చేయాల్సిందే.

విగ్నేష్ శివ‌న్ తినాల్సిందేన‌ట‌. ప‌ప్పు తిని తిని విగ్నేష్ కూడా చాలాసార్లు బోర్ ఫీల్ అయ్యాడుట‌. పెళ్లైన కొత్త‌లో నో అని చెప్ప‌లేక రాజీ ప‌డితే? ఇప్పుడు న‌య‌న‌తార బ‌ల‌వంతంగా వండి మ‌రీ నోట్లు పెట్టేస్తుంద‌న్నాడు. మ‌రి ప‌ప్పు వ‌డ్డించ‌డం వ‌ర‌కేనా? తాను కూడా అంతే ఇష్టంగా తింటుందా? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. ప‌ప్పు ట‌మోటోను ప్ర‌త్యేకంగా ఇష్ట‌ప‌డే సెల‌బ్రిటీలు చాలా మంది ఉన్నారు. బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్, అమితాబ‌చ్చ‌న్, మహేష్, షారుక్ ఖాన్, అలియాభ‌ట్, సాయిప‌ల్ల‌వి డైలీ మెనూలో కామ‌న్ గా టేబుల్ పై ప‌ప్పు ఉండాల్సిందే.

Tags:    

Similar News