జై హనుమాన్‌ తో ప్రశాంత్ వర్మ ముందున్న కొత్త పరీక్ష!

2024 సంక్రాంతి రేసు లో చిన్న సినిమాగా వ‌చ్చిన హ‌ను మాన్ ఎంత పెద్ద సక్సెస్‌ను అందుకుందో తెలిసిందే.;

Update: 2026-02-27 17:30 GMT

2024 సంక్రాంతి రేసు లో చిన్న సినిమాగా వ‌చ్చిన హ‌ను మాన్ ఎంత పెద్ద సక్సెస్‌ను అందుకుందో తెలిసిందే. హ‌ను మాన్ రిలీజ్ త‌ర్వాత డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ పేరుతో పాటూ తేజ స‌జ్జ పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోయింది. చిన్న బ‌డ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్, డివోష‌న‌ల్ ఎమోష‌న్, సూప‌ర్ హీరో ఎలిమెంట్స్ వ‌ల్ల ఊహించ‌ని క‌లెక్ష‌న్ల‌ను అందుకుంది. హ‌నుమాన్ సినిమా బాగా స‌క్సెస్ అవ‌డంతో ఆ సినిమాకు సీక్వెల్ గా రానున్న జై హ‌నుమాన్ పై అంచ‌నాలు భారీగా ఉండ‌టం స‌హ‌జం.

రిషబ్ రూపంలో తోడైన స్టార్ ప‌వ‌ర్

జై హ‌నుమాన్ ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే భారీగా తెర‌కెక్కుతుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. దానికి కార‌ణం సినిమా మార్కెట్ తో పాటూ మూవీకి రిష‌బ్ శెట్టి రూపంలో స్టార్ ప‌వ‌ర్ కూడా తోడైంది. ఈ క్ర‌మంలో జై హ‌నుమాన్ బ‌డ్జెట్ ను కంట్రోల్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. బ‌డ్జెట్ భారీగా పెరిగితే, సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రిగినా లాభాలు క్షీణించే ప్ర‌మాద‌ముంది. దానికి తోడు సినిమా బిజినెస్ ఎప్పుడూ క‌లెక్ష‌న్ల‌పైనే ఆధార‌ప‌డ‌దు. పెట్టుబ‌డి, క‌లెక్ష‌న్లు కూడా కీల‌క పాత్ర వ‌హిస్తాయి. హ‌నుమాన్ స‌క్సెస్ తో పాటూ జై హ‌నుమాన్ కు ఉన్న క్రేజ్ వ‌ల్ల ఈ సినిమాకు భారీ బిజినెస్ జ‌రిగే అవ‌కాశ‌మైతే ఉంది. కానీ బిజినెస్ జ‌రుగుతుందిలే అని ఖ‌ర్చుల్ని కూడా భారీగా పెంచితే నిర్మాత‌ల మార్జిన్లు బాగా త‌గ్గిపోయే ఛాన్సుంది.

త‌క్కువ బ‌డ్జెట్ తోనే అద్భుతాలు చేసిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌

ఏదైనా భారీ బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్కుతుందంటే అందులో స‌గం బ‌డ్జెట్ వీఎఫ్ఎక్స్, సెట్ వ‌ర్క్స్, రెమ్యూన‌రేష‌న్ల‌కే స‌రిపోతుంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్న‌ప్పుడే ఖ‌ర్చు ఎంతైనా న్యాయ‌బ‌ద్ధ‌మ‌వుతుంది కానీ అలా లేక‌పోతే ఎంత పెద్ద సినిమా అయినా ఫ‌లితం నిరాశ క‌లిగించే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో బ‌డ్జెట్ ను త‌గ్గించాల్సిన బాధ్య‌త డైరెక్ట‌ర్ పైనే ఉంది. ప్ర‌శాంత్ వ‌ర్మ అనుకోవాలే కానీ అదేమీ పెద్ద ప‌ని కాదు. ఎందుకంటే త‌క్కువ బ‌డ్జెట్ లోనే హ‌నుమాన్ సినిమాను కాస్త టైమ్ ఎక్కువ తీసుకున్న‌ప్ప‌టికీ చాలా గ్రాండ్ గా, విజువ‌ల్ వండ‌ర్ గా ప్రెజెంట్ చేయ‌గ‌లిగారు. ఇప్పుడు జై హ‌నుమాన్ విష‌యంలో కూడా అంతే ప్లానింగ్ గా ముందుకెళ్తే ఈ సినిమాతో కూడా ప్ర‌శాంత్ వ‌ర్మ మ‌రోసారి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరచొచ్చు.

జై హ‌నుమాన్ పై ఆడియ‌న్స్ లో భారీ ఆస‌క్తి ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా నిజ‌మైన స‌క్సెస్ ను డిసైడ్ చేసేది కేవ‌లం ఓపెనింగ్స్ మాత్ర‌మే కాదు, స‌మ‌ర్థ‌వంత‌మైన ప్రొడ‌క్ష‌న్ ప్లానింగ్ కూడా. ఈ నేప‌థ్యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సారి కేవ‌లం డైరెక్ట‌ర్ గానే కాకుండా వ్యూహాత్మ‌కంగా ప్లాన్స్ వేస్తూ ముందుకెళ్లాల్సిన అవ‌స‌ర‌ముంది. స్క్రీన్ పై గ్రాండ్‌నెస్ ఉంటూనే, బ‌డ్జెట్ ను మించ‌కుండా చూసుకుంటేనే జై హ‌నుమాన్ మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంది.

Tags:    

Similar News