రష్మిక కోసం చైతన్య డైరెక్టర్ ప్రయత్నాలా?
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నాని ఎంపిక చేయా లని చూస్తున్నారుట. హీరోయిన్ పాత్రకు రష్మిక అన్ని రకాలుగా సూటవుతుందిట.;
యువ సామ్రాట్ నాగచైతన్య ఫుల్ జోష్ లోఉన్న సంగతి తెలిసిందే. `తండేల్` సక్సెస్ తో రెట్టించిన ఉత్సా హంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చైతన్య హీరోగా `విరూపాక్ష` ఫేం కార్తీక్ దండు ఓ మిస్టికల్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇది చైతన్య 24వ చిత్రం. అటు 25వ చిత్రం కూడా లాక్ అయింది. శివ నిర్వాణ తో ఆ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇది చైతన్యకు ల్యాండ్ మార్క్ చిత్రం కావడంతో చైతన్య నమ్మిన శివకు అవకాశం కల్పించాడు.
వాస్తవానికి ఈ నెంబర్ కోసం చాలా మంది దర్శకులు క్యూలో ఉన్నారు. కిషోర్ అనే కొత్త కుర్రాడి కూడా ఓ కథను నేరెట్ చేసాడు. అది చైతన్యకు బాగా నచ్చింది. కానీ అది 26వ చిత్రంగా ప్లాన్ చేస్తున్నాడు. శివతో తన 25వ చిత్రం ఉండాలని అదీ మంచి లవ్ స్టోరీ అవ్వాలని ప్లాన్ చేసి ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ ఆ ప్రాజెక్ట్ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. కొత్త అవకాశాలు వస్తున్నా శివ అటువైపు వెళ్లకుండా చైతన్య కోసమే పనిచేస్తున్నాడు. సంవత్సరాలుగా స్క్రిప్ట్ ని చెక్కుతున్నాడు.
శివ నుంచి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి మరో ఆలోచన లేకుండా చైతన్య కథపై నే పనిచేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నాని ఎంపిక చేయా లని చూస్తున్నారుట. హీరోయిన్ పాత్రకు రష్మిక అన్ని రకాలుగా సూటవుతుందిట. పాత్రలో యెగ్రసివ్ నెస్ కూడా ఉండటంతో రష్మిక పర్పెక్ట్ ఛాయిస్ గా భావిస్తున్నారుట. మరి ఈరోల్ విషయంలో రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. పాత్ర నచ్చితే రష్మిక నో చెప్పకుండా పనిచేస్తుంది.
తాను నేషనల్ క్రష్ అయినా? కొన్ని లిమిటేషన్స్ తోనే పని చేస్తుంది. చైతన్య సరసన అవకాశం అంటే తాను నో చెప్పే ఛాన్సెస్ తక్కు వ. అయితే డేట్లు సర్దుబాటు చేయడం అన్నది ముఖ్యం. ప్రస్తుతం అమ్మడు పుల్ బిజీగా ఉంది. అగ్ర హీరోల సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అదీ తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ బిజీగా ఉంది. మరి ఇలాంటి బిజీ షెడ్యూల్ నడుమ రష్మిక రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.