• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేశ రాజ‌కీయాల్లో గేమ్...

దేశ రాజ‌కీయాల్లో గేమ్ ఛేంజ‌ర్.. ప‌వ‌న్‌పై నాగ‌బాబు ప్ర‌క‌ట‌న‌!

| జనసేనాని పవన్ క‌ల్యాణ్‌ని భారత రాజకీయాల గేమ్‌ చేంజర్‌ అంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ఆసక్తికర ప్రకటన చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-24 11:38 GMT

జనసేనాని పవన్ క‌ల్యాణ్‌ని భారత రాజకీయాల గేమ్‌ చేంజర్‌ అంటూ మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ఆసక్తికర ప్రకటన చేశారు. ``పొలిటికల్ గేమ్ ఛేంజర్ ఆఫ్ కరెంట్ ఇండియన్ పాలిటిక్స్`` అనేది నాగబాబు సోషల్ మీడియా సందేశం. ఇది జ‌న‌సైనికుల్లో స‌రికొత్త ఉత్సాహం నింపుతోంది.

ఆయ‌న ఇలా ప్ర‌క‌టించ‌డం వెన‌క ప్ర‌త్యేక కార‌ణం ఏదైనా ఉందా? అంటే క‌చ్ఛితంగా ఉంది. ఇది జ‌న‌సేనాని వీర‌త్వానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం ఎన్డీకే కూట‌మికి మ‌హా ఎన్నిక‌ల్లో ఎలా క‌లిసొచ్చిందో వివ‌రించే ప్ర‌క‌ట‌న ఇది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే మ‌ద్ధ‌తుగా ఉన్న మ‌హాయుతి కూట‌మికి అఖండ మెజారిటీ రావ‌డం వెన‌క జ‌న‌సైనికులు, ప‌వ‌న్ అభిమానుల అండ‌దండలున్నాయి. ఒకే ఒక్క సీటు మిన‌హా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌చారం చేసిన అన్ని సీట్ల‌ను భాజ‌పా గెలుచుకుంది. దీంతో నాగ‌బాబు నుంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

``గెలిచిన ప్రతి రాజకీయ నాయకుడు హీరో. అయితే ప్రతి హీరో ఎన్నికల్లో గెలవలేరు. కేవలం గెలవకుండా తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాడే నిజమైన నాయకుడు. అతడి విజయం ఇతరులకు విజయపథంలో స్ఫూర్తినిస్తుంది. అలాంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్`` అని నాగ‌బాబు అన్నారు.

నాగ‌బాబు పూర్తి ప్ర‌క‌ట‌న ఇలా ఉంది.

గెలిచే ప్రతి నాయకుడు హీరోనే,

కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు..

నాయకుడంటే గెలిచే వాడే కాదు

నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం

అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం

నీడై నిలబడేవాడు,

తోడై నడిపించేవాడు,

వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు,

వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే వాడు,

అలాంటి అరుదైన నాయకుడే నా నాయకుడు `ది పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ‌ర్ ఆఫ్ క‌రెంట్ ఇండియ‌న్ పాలిటిక్స్` `పవన్ కళ్యాణ్`

గెలిచే ప్రతి నాయకుడు హీరోనే,
కాని ప్రతి హీరో నాయకుడు కాలేడు..
నాయకుడంటే గెలిచే వాడే కాదు
నమ్మిన సిద్ధాంతాల కోసం సైధ్దాంతిక విలువల కోసం
అవి నమ్మి నడిచే వ్యక్తుల కోసం
నీడై నిలబడేవాడు,
తోడై నడిపించేవాడు,
వారి గమ్యంలో గెలుపుని చూసుకునే వాడు,
వారి గెలుపులో మరో గమ్యాన్ని వెతుక్కునే… pic.twitter.com/yUD70KtESg

— Naga Babu Konidela (@NagaBabuOffl) November 24, 2024
Tags:    
  • Nagababu 
  • Janasena 
  • Pawankalyan 
  • APdeputychiefminister 
  • Maharashtraassemblyelections 
  • Ndaalliance 
  • Bjp 
  • Tdp 
  • Chandrababunaidu 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS