• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆమె రేంజ్ తగ్గిందా.. అతడి...

ఆమె రేంజ్ తగ్గిందా.. అతడి రేంజ్ పెరిగిందా?

| అందంతోనే కాక అభినయంతోనూ ఆమె ఆకట్టుకుని వరుసగా అవకాశాలు సంపాదించింది.

By - Tupaki Desk
Update: 2024-04-21 02:30 GMT

నభా నటేష్.. రష్మిక మందన్నా లాగే కన్నడ నుంచి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి స్టార్ స్టేటస్ సంపాదించిన అమ్మాయి. తొలి చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’తోనే ఆమె మంచి పేరు సంపాదించింది. అందంతోనే కాక అభినయంతోనూ ఆమె ఆకట్టుకుని వరుసగా అవకాశాలు సంపాదించింది.

రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’, రవితేజతో ‘డిస్కో రాజా’; సాయిధరమ్ తేజ్‌తో ‘సోలో బ్రతుకే సో బెటర్’.. ఇలా వరుసగా మిడ్ రేంజ్ స్టార్లతో సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బాగా బిజీ అవుతున్నట్లే కనిపించింది నభా. ‘ఇస్మార్ట్ శంకర్’లో తన హాట్ హాట్ లుక్స్ చూసి యూత్ ఫిదా అయిపోయారు. ఆ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో ఆమెకు తిరుగులేదనుకున్నారు.

కానీ తర్వాత వరుసగా ఆమెకు ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనికి తోడు ఒక యాక్సిడెంట్లో గాయపడ్డం కూడా కెరీర్‌కు ప్రతికూలంగా మారింది. దీంతో రెండేళ్ల పాటు నభా పేరే వినిపించలేదు టాలీవుడ్లో. కొన్ని నెలల కిందట నభా మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. తాను సినిమాలు చేయడానికి మళ్లీ రెడీ అని సంకేతాలు ఇస్తూ వస్తోంది.

ఐతే చాలా రోజులు ఆమెను టాలీవుడ్ ఫిలిం మేకర్స్ పట్టించుకోలేదు. ఐతే ఇప్పుడు ‘డార్లింగ్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఐతే నభా అభిమానులకు ప్రియదర్శి లాంటి చిన్న హీరో సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వడం నచ్చలేదు. రీఎంట్రీ కోసం ఇంకొంచెం బెటర్ ప్రాజెక్ట్ చూసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. నభా రేంజ్ పడిపోయిందా.. ప్రియదర్శి స్థాయి పెరిగిందా అని కామెంట్లు చేస్తున్నారు.

ఐతే అసలు ఛాన్సులే లేనపుడు ఏదో ఒక సినిమాలో అవకాశం రావడమే గొప్ప అంటున్న వారూ లేకపోలేదు. ప్రియదర్శి ఒకప్పుడు జస్ట్ కమెడియన్ మాత్రమే. కానీ లీడ్ రోల్స్‌లో మల్లేశం, బలగం లాంటి గొప్ప సినిమాలు చేసి ఇప్పుడు స్థాయి పెంచుకున్నాడు. కాబట్టి నభాది మరీ బ్యాడ్ రీఎంట్రీ ఏమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
  • Tollywood 
  • TeluguFilmIndustry 
  • Kannada 
  • IsmartShankar 
  • Ram 
  • DiscoRaja 
  • RaviTeja 
  • SaidharamTej 
  • NabhaNatesh 
  • Darling 
  • Priyadarshi 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS