బాక్సాఫీస్.. బాహుబలి, RRR కంటే టాప్ లో మెగా MSG

అసలు నంబర్ల విషయానికి వస్తే, 'మన శంకర వరప్రసాద్ గారు' ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 12.52 కోట్ల షేర్‌ను వసూలు చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డును క్రియేట్ చేసింది.;

Update: 2026-01-19 12:55 GMT

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా బాక్సాఫీస్ లెక్కల గురించే చర్చ జరుగుతోంది. పండగ సీజన్ అంటేనే రికార్డుల వేట మొదలవుతుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ విధ్వంసం కనిపిస్తోంది. సాధారణంగా వీకెండ్ తర్వాత ఏ సినిమాకైనా కలెక్షన్స్ కొంచెం తగ్గుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఏడో రోజు కూడా వీకెండ్ రేంజ్ వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' (MSG) అదే బాటలో వెళ్తూ పాత రికార్డులను తిరగరాస్తోంది.

ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కి పండగ సెలవులు తోడవ్వడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఆగడం లేదు. చిరంజీవి, వెంకటేష్ వంటి ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం ఆడియన్స్‌కు ఒక పెద్ద ప్లస్ అయ్యింది. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను విన్నర్‌గా నిలబెట్టారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో MSG టాప్ ప్లేస్‌లోకి దూసుకెళ్లింది.

అసలు నంబర్ల విషయానికి వస్తే, 'మన శంకర వరప్రసాద్ గారు' ఏడో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 12.52 కోట్ల షేర్‌ను వసూలు చేసి ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా ఏడో రోజు ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. ఇదివరకు అల.. వైకుంఠపురములో పేరు మీద ఉన్న 8.43 కోట్ల రికార్డును MSG చాలా పెద్ద మార్జిన్‌తో దాటేయడం గమనార్హం. కేవలం పండగ హడావుడి మాత్రమే కాదు, కంటెంట్ పట్ల ఆడియన్స్ చూపిస్తున్న ఆదరణకు ఇది నిదర్శనం.

గతంలో బాహుబలి 2, సైరా నరసింహారెడ్డి వంటి భారీ చిత్రాలు కూడా ఏడో రోజున మంచి వసూళ్లు సాధించాయి. బాహుబలి 2 లాంటి గ్లోబల్ హిట్ కూడా అప్పట్లో 8.30 కోట్లు మాత్రమే సాధించగలిగింది. అలాగే చిరంజీవి గత చిత్రం సైరా 7.90 కోట్లు వసూలు చేస్తే, సరిలేరు నీకెవ్వరు 7.64 కోట్లు రాబట్టింది. రాజమౌళి విజువల్ వండర్ RRR కూడా 7.48 కోట్ల దగ్గరే ఆగిపోయింది. వీటన్నిటితో పోలిస్తే MSG సాధించిన 12.52 కోట్లు అంటే బాక్సాఫీస్ వద్ద మెగా విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ కనుమరుగైపోతున్నాయి. ఒక్కో రికార్డును దాటుకుంటూ MSG ముందుకు వెళ్తున్న తీరు ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. సెలవులు ముగిసిన తర్వాత కూడా ఈ జోరు ఇలాగే కొనసాగితే మరిన్ని కొత్త రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు అత్యధిక షేర్ సాధించిన సినిమాలు ఇవే..

మన శంకర వరప్రసాద్ గారు: 12.52 కోట్లు

అల.. వైకుంఠపురములో: 8.43 కోట్లు

బాహుబలి 2: 8.30 కోట్లు

సైరా నరసింహారెడ్డి: 7.90 కోట్లు

సరిలేరు నీకెవ్వరు: 7.64 కోట్లు

RRR: 7.48 కోట్లు

Tags:    

Similar News