• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వాట్ నెక్స్ట్ మృణాల్..?

వాట్ నెక్స్ట్ మృణాల్..?

| బాలీవుడ్ లో రాని అవకాశాలు తెలుగులో వస్తుండటంతో డబుల్ ఇంపాక్ట్ తో చేస్తుంది మృణాల్ ఠాకూర్

By - Tupaki Desk
Update: 2024-03-03 06:54 GMT

బాలీవుడ్ సీరియల్స్ నుంచి సినిమాలకు ప్రమోట్ అయిన మృణాల్ ఠాకూర్ హను రాఘవపుడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. సీతారామం ముందు వరకు మృణాల్ ఠాకూర్ కెరీర్ ఒకలా ఉంటే ఆఫ్టర్ సీతారామం అమ్మడి కెరీర్ మరోలా మారిపోయింది. ఒక సినిమా హిట్ హీరోయిన్ కెరీర్ ని ఏ రేంజ్ కు తీసుకెళ్తుంది అన్నది మృణాల్ ని చూస్తే అర్ధమవుతుంది. హిందీలో తనకు ప్రేమ కథలు రావట్లేదని బాధపడుతున్న అమ్మడికి తెలుగులో కథా బలం ఉన్న పాత్రలే ఇస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో రాని అవకాశాలు తెలుగులో వస్తుండటంతో డబుల్ ఇంపాక్ట్ తో చేస్తుంది మృణాల్ ఠాకూర్. సీతారామం తర్వాత హాయ్ నాన్న హిట్ అమ్మడి క్రేజ్ ని మరింత పెంచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న మృణాల్ ఆ సినిమాతో కూడా సూపర్ హిట్ పక్కా అనేస్తుంది. విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కి సినిమా జస్ట్ ఓకే అనిపించినా సూపర్ హిట్ రిజల్ట్ వచ్చేస్తుంది. ఫ్యామిలీ స్టార్ కి మృణాల్ హిట్ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు.

అయితే సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూడు సినిమాలతోనే తెలుగులో సరికొత్త సంచలనంగా మారిన ఆ తర్వాత సినిమాల విషయంలో దూకుడు చూపించట్లేదు. అవకాశాలైతే వస్తున్నా కూడా తనకు నచ్చిన పాత్రలనే చేస్తూ వస్తుంది మృణాల్. బాలీవుడ్ లో ఎలాగు తనకు హా**ట్ ఇమేజ్ వచ్చేలా చేశారు. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో తనకు వస్తున్న ఈ అవకాశాలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది మృణాల్. అందుకే ఇక్కడ గ్లామర్ రోల్స్ వచ్చినా ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేస్తుంది.

ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇప్పటివరకు మృణాల్ నెక్స్ట్ సినిమా అప్డేట్ బయటకు రాలేదు. కథల విషయంలో తను స్ట్రిక్ట్ గా ఉంటుంది కాబట్టే మృణాల్ కి నెక్స్ట్ ఆఫర్ రాలేదని అంటున్నారు. అయితే ఫాం లో ఉన్నప్పుడు ఓకే కానీ కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది అనుకుంటే మాత్రం ఎలాంటి హీరోయిన్ అయినా సరే పట్టు విడవక తప్పదు. మరి తెలుగులో మృణాల్ నెక్స్ట్ సినిమాల విషయంలో తన గ్లామర్ సైడ్ ఓపెన్ చేస్తుందా లేదా బలమైన పాత్రలే కావాలని వెయిట్ చేస్తుందా అన్నది చూడాలి.

Tags:    
  • Mrunalthakur 
  • Filmindustry 
  • HiNanna 
  • Familystarmovie 
  • Mrunal 
  • Bollywood 
  • Mrunalnextproject 

Similar News

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS