మృణాల్.. స్క్రిప్టు లేని మూవ్‌మెంట్స్
మృణాల్ ఠాకూర్ ఇటీవల ఊహించని కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగతి తెలిసిందే.;
మృణాల్ ఠాకూర్ ఇటీవల ఊహించని కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లోకొస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో తమిళ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమాయణం గురించి ఎక్కువగా గుసగుసలు వినిపించాయి. అయితే ఈ ప్రచారాన్ని నర్మగర్భ వ్యాఖ్యలతో మృణాల్ ఖండించింది. తనపై వచ్చే ఇలాంటి వార్తలు చదివి నవ్వుకుంటానని తెలిపింది.
మరోవైపు మృణాల్ దీపం ఉండగానే చక్కదిద్దుకునే పనిలో ఉంది. తొందర్లోనే తన సోదరుడిని హీరోని చేసేందుకు మృణాల్ తెలివైన ప్రణాళికలను రచిస్తోంది. తన సోదరుడు ధావల్ థాకూర్ కథానాయకుడిగా నటించే సినిమాకు పెట్టుబడులు సమకూరుస్తోందని కూడా గుసగుసలు వినిపించాయి.
ఓవైపు కెరీర్ పరంగా బిజీగా ఉన్నా, నిరంతరం సోషల్ మీడియాల్లో అనుచరులను విడిచి పెట్టడం లేదు. మృణాల్ రెగ్యులర్ గా తన ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా మృణాల్ కొత్త లుక్ ఒకటి ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ ఫోటోషూట్ లో రెగ్యులర్ క్యాజువల్ లుక్ లో కనిపించిన మృణాల్ దీనికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. ``అన్ స్క్రిప్టెడ్ మూవ్‌మెంట్స్`` పేరుతో ఈ కొత్త లుక్ ని మృణాల్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ డెనిమ్స్ ఫ్యాంట్, కాంబినేషన్ బ్లాక్ డ్రెస్ లో మెరిసిన మృణాల్ ఒక లెదర్ కోట్ తో తన ఇన్నర్ అందాలను కవరప్ చేసింది. ప్రస్తుతం ఈ స్పెషల్ లుక్ ఇంటర్నెట్ లో జరుగా వైరల్ అవుతోంది. మృణాల్ ఈ కొత్త లుక్ లో ఎంతో అందంగా ఉందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.