ఫోటోటాక్ : చీర కట్టుతో మృణాల్ పండగ స్పెషల్
మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో అందం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే.;
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ తెలుగులో తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరి పోయింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న కారణంగా మృణాల్ ఠాకూర్‌తో ఎక్కువ సినిమాలు చేసేందుకు తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. కానీ మృణాల్ మాత్రం ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు హిందీ సినిమాలతో బిగ్ బ్రేక్ దక్కకున్నా అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ ఉంది. ఇటీవల కూడా మృణాల్ హిందీ సినిమాతో వచ్చింది, రెండు మూడు హిందీ సినిమాలను ఆమె చేస్తూనే ఉంది. తెలుగులో చాలా అరుదుగా మాత్రమే ఈ సినిమాలు చేయడం ద్వారా విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.
ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ అందాల షో
మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో అందం గురించి చేసిన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. సినిమాలతో కంటే ఎక్కువగా అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా మృణాల్ ఠాకూర్ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సైతం ఎప్పటిలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఠాకూర్ ఏ ఫోటోలు షేర్ చేసినా తెగ వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. 15 మిలియన్‌లకు పైగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న మృణాల్ ఠాకూర్ చీర కట్టు ఫోటోలను షేర్ చేసిన ప్రతి సారి లక్షల కొద్ది లైక్స్, అంతకు మించి కామెంట్స్, షేర్స్ దక్కుతూ ఉంటాయి. చీర కట్టులో మృణాల్ ఎప్పటికంటే దాదాపుగా డబుల్ అందంగా కనిపిస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు.
చీర కట్టులో మృణాల్ ఠాకూర్
ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఈ ఫోటోలను షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చీర కట్టు ఫోటోల్లో మృణాల్ చాలా అందంగా ఉంది. ఈ ఫోటోలతో పాటు ఇన్‌స్టాలో.. గణేష్ చతుర్ధి ఎప్పుడూ నాకు ప్రత్యేకమైన పండుగ, ఇంట్లో ఎప్పుడూ సంతోషంను నింపే పండుగ. ఈ సంవత్సరం పార్వతి దేవికి, దైవిక స్త్రీత్వం, శక్తి గణేషుడి కృపతో మేము సంప్రదాయంగా మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. బంగారు రంగులతో కప్పబడిన గణేషుడి ఆశీర్వాదం దక్కడం చాలా సంతోషంగా ఉంది, అంతే కాకుండా ఆత్మ విశ్వాసం పెంచే విధంగా ఉందని మృణాల్ పోస్ట్ చేసింది. మృణాల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బాగా వైరల్ అవుతోంది. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా రెగ్యులర్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే.
అడవి శేష్ డెకాయిట్‌లో..
ప్రస్తుతం తెలుగులో అడవి శేష్‌తో కలిసి డెకాయిట్ సినిమాను చేస్తున్న మృణాల్ ఠాకూర్ తమిళ్‌లో ఒక సినిమాను చేయనుంది. ఇప్పటికే ఈమె ఈ ఏడాది సన్నాఫ్ సర్ధార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా సైతం మృణాల్‌కి బాలీవుడ్‌లో బ్రేక్‌ను తెచ్చి పెట్టలేదు. అయినా కూడా హిందీలో ఈమె ప్రస్తుతం రెండు మూడు సినిమాలు చేస్తోంది. ఇవి మాత్రమే కాకుండా అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న ఒక భారీ పాన్ ఇండియా మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకునే నటిస్తుండగా, మృణాల్‌ను ప్రత్యేకమైన పాత్రకు సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఆ సినిమాలోని పాత్ర గురించి ప్రకటన రాలేదు.