రవితేజ ఫ్యామిలీ నుంచి యంగ్ హీరో.. టీజర్ చూశారా..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే.

Update: 2024-05-10 09:17 GMT

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి.. స్టార్ హీరోగా ఎదిగారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే రవితేజ ఇద్దరు తమ్ముళ్లు కూడా పలు సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు రవితేజ తమ్ముడి కుమారుడు హీరోగా పరిచయమవుతున్నారు.


రవితేజ తమ్ముడు రఘు కుమారుడు మాధవ్.. 'మిస్టర్ ఇడియట్' మూవీతో హీరోగా లాంఛ్ అవుతున్నారు. పెళ్లిసందడి ఫేమ్ దర్శకురాలు గౌరీ రోణంకి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యలమంచి రాణి సమర్పణలో జేజేఆర్ రవిచంద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను రవితేజ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

టీజర్ ప్రకారం.. ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే హీరోయిన్ కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ల‌ను అద్భుతంగా గీస్తుంటుంది. ఆమెకు కాలేజీలో టాలెంట్ తో పాటు అందంలో బీట్ చేయడం ఎవరి వల్ల కూడా కాదు. అలాంటి టైమ్ లో హీరో (మాధవ్) కాలేజ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. హీరోయిన్ ను 'న గుణింతం' అంటూ పిలుస్తూ టీజ్ చేస్తుంటాడు. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు? మరి వీరిద్దరికి పెళ్లి అయిందా లేదా అనేది సినిమాగా తెలుస్తోంది.

అయితే టీజర్ ను ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. మాధవ్ స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకున్నారు. తన యాక్షన్ తో కూడా మెప్పించారు. చెప్పాలంటే.. మాధవ్ ను చూస్తే రవితేజ కచ్చితంగా గుర్తుకొస్తారు. ఇడియట్ లోని ఐకానిక్ పోజ్ అయిన హీరోయిన్ నడుమును మోకాళ్ల మీద హీరో పట్టుకోవడం, రవితేజ వాకింగ్ స్టైల్ ను మాధవ్ రీ క్రియేట్ చేయడం.. సినిమాలో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు.

Read more!

అయితే రవితేజ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇడియట్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మాధవ్ కూడా పెద్దనాన్న హిట్ సినిమా టైటిల్ ని తీసుకొని టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్లను త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. మరి మాధవ్.. డెబ్యూ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Full View
Tags:    

Similar News