స్టార్‌ కపుల్‌ అన్‌ఫాలో... విడాకులు కన్ఫర్మ్‌?

'నాగిని' సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. సీరియల్స్‌లో ఒకానొక సమయంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా మౌనీ రాయ్‌ నిలిచింది.

Update: 2026-05-12 12:56 GMT

'నాగిని' సీరియల్‌తో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ మౌనీ రాయ్‌. సీరియల్స్‌లో ఒకానొక సమయంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా మౌనీ రాయ్‌ నిలిచింది. ఆకట్టుకునే రూపంతో పాటు, చక్కని నటన మౌనీరాయ్‌ ను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాయి. అందుకే మౌనీ రాయ్‌ సినిమాల్లోనూ ఆఫర్లు సొంతం చేసుకుంది. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే మౌనీ రాయ్‌ ప్రేమలో పడింది. 2019లో బిజినెస్‌ మెన్‌ సూరజ్ తో మోనీ కి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు దాదాపుగా మూడు ఏళ్ల పాటు ప్రేమలోనే ఉన్నారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నామని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. పెద్దల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. 2022లో వీరి వివాహం జరిగింది. పెళ్లి అయిన కొన్నాళ్ల పాటు అంతా సవ్యంగా సాగింది. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు అనే వార్తలు వచ్చాయి.

మౌనీ రాయ్‌ విడాకుల విషయం...

సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా మౌనీ రాయ్‌ నటిగా కొనసాగింది. ఆమె నటన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయినా కూడా నంబియార్‌ నుంచి మౌనీ రాయ్ విడి పోతుందనే వార్తలు జోరుగా వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్‌లో ఒకరిని ఒకరు అన్‌ ఫాలో చేయడం జరిగింది. అంతే కాకుండా ప్రేమ, పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను, ఇతర అన్ని పోస్ట్‌లను తొలగించారు. చాలా తక్కువ సమయంలోనే వీరు విడి పోవడం చాలా మందికి బాధ కలిగిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా వీరిద్దరూ చెప్పకనే తాము విడి పోతున్నాం అని చెప్పినట్లు ఉందని, వీరు విడాకులు తీసుకునేందుకు రెడీ అయ్యారనే వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. అయితే వీరి బ్రేకప్‌ కి కారణం ఏంటి అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

దిశా పటానీ సైతం అతడిని అన్‌ఫాలో...

మౌనీ రాయ్‌ కి హీరోయిన్ దిశా పటానీ మంచి ఫ్రెండ్‌ అనే విషయం తెల్సిందే. ఇద్దరి మధ్య స్నేహంకు మించిన అనుబంధం ఉందని బాలీవుడ్‌లో అనుకుంటారు. అలాంటి దిశా పటానీ సైతం ఇన్నాళ్లు మౌనీరాయ్‌ భర్త సూరజ్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ వచ్చింది. ఇటీవల సూరజ్‌ ను మౌనీరాయ్‌ అన్‌ ఫాలో చేయడం, ఆ వెంటనే దిశా పటానీ సైతం ఆయన్ను ఇన్‌స్టాలో అన్‌ ఫాలో చేయడం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ చాలా వచ్చిందని, దాన్ని కలిపే అవకాశం లేనట్లే అని బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు. పెళ్లి చేసుకుని కనీసం నాలుగు ఏళ్లు సైతం కలిసి ఉండలేక పోయిన ఈ జంట విడిపోవడానికి కారణం ఏంటి అనేది అందరూ చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు వీరి విడాకుల విషయమై అధికారిక ప్రకటన రాలేదు. కానీ జరుగుతున్న పరిణామాలు అన్ని చూస్తే కచ్చితంగా ఇద్దరూ విడిపోయేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.

బ్రహ్మాస్త్ర సినిమాలో నటిగా...

బాలీవుడ్‌ మూవీ బ్రహ్మాస్త్రలో మౌనీ రాయ్‌ పోషించిన పాత్రకు మంచి స్పందన దక్కింది. ఆమె నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమా తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చి పెట్టడంతో నటిగా అక్కడ ఇక్కడ అన్నట్లుగా బిజీ అయ్యింది. మౌనీ రాయ్‌ ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో ప్రత్యేక పాటలో కనిపించింది. వశిష్ట దర్శకత్వంలో రూపొందిన విశ్వంభర మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. విశ్వంభర సినిమా తర్వాత కచ్చితంగా మౌనీ రాయ్ తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భర్త నుంచి దూరం కాబోతున్న నేపథ్యంలో మౌనీరాయ్‌ మరింత బిజీ బిజీగా మారేందుకు గాను ఎక్కువ సినిమాలు కమిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఈమె మరిన్ని ఐటెం సాంగ్స్ చేస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News