• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్లిన్ కారా బర్త్‌డే:...

క్లిన్ కారా బర్త్‌డే: నెట్టింట‌ మెగా-అల్లు ఫ్యామిలీ బాండింగ్!

| ఇక ఈ పోస్ట్ కింద అభిమానులు పెడుతున్న కామెంట్లలో క్లిన్ కారాను `మెగా లిటిల్ ఏంజెల్`, `ప్రిన్సెస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ` అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-06-28 06:27 GMT

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్- ఉపాసన కొణిదెల దంపతుల ముద్దుల కుమార్తె క్లిన్ కారా కొణిదెల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మెగాభిమానులు ఈ క్యూటీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేసారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మెగా అభిమానులు, నెటిజన్లు ఈ లిటిల్ ప్రిన్సెస్ కి పెద్ద ఎత్తున బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

అయితే ఈ బర్త్‌డే పోస్ట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పంద‌న‌. అత‌డు హార్ట్ ఈమోజీని షేర్ చేసి క్లిన్ కారాపై త‌న ప్రేమ‌ను కురిపించాడు. ఈ క్రేజీ కామెంట్‌ను గమనించిన మెగా - అల్లు అభిమానులు సోషల్ మీడియాలో తెగ మురిసిపోతున్నారు. ఒక అభిమాని అయితే ``బ్రో.. అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఇక్కడ కామెంట్ చేశాడు చూశారా`` అంటూ స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. మెగా లీగసీని ముందుకు తీసుకెళ్తున్న నెక్స్ట్ జనరేషన్ పిల్లల గురించి నెటిజ‌నుల్లో స‌ర‌దాగా చ‌ర్చ సాగింది.

ఇక ఈ పోస్ట్ కింద అభిమానులు పెడుతున్న కామెంట్లలో క్లిన్ కారాను `మెగా లిటిల్ ఏంజెల్`, `ప్రిన్సెస్ ఆఫ్ మెగా ఫ్యామిలీ` అని పిలుస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చిన్నారి క్లిన్ కారాకు దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని... ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని నెటిజన్లు మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. అయాన్ చేసిన ఈ చిన్న కామెంట్ వల్ల క్లిన్ కారా బర్త్‌డే పోస్ట్ మరింత వైరల్‌గా మారింది.

సమకాలీన సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ప్ర‌పంచంలో ఎలాంటి సమీకరణాలు ఉన్నా.. కుటుంబాల పరంగా.. నెక్స్ట్ జనరేషన్ పిల్లల పరంగా మెగా-అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఈ ఇన్సిడెంట్ మరోసారి నిరూపించింది. రామ్ చరణ్ కుమార్తె పుట్టినరోజు వేడుకలో అల్లు అర్జున్ ఇలా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రేమ‌ను కురిపించ‌డం మెగా ఫ్యాన్స్‌లో ఒక పాజిటివ్ వైబ్‌ని తీసుకొచ్చింది. ఈ వైరల్ మూమెంట్ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

అల్లు అర్హ‌, అయాన్‌ల‌కు చ‌ర‌ణ్ విషెస్:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారసులైన అల్లు అయాన్, అల్లు అర్హలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విభిన్న సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా ఎంతో ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. అయాన్ పుట్టినరోజున చెర్రీ స్పందిస్తూ ``హ్యాపీ బర్త్‌డే అయాన్.. గాడ్ బ్లెస్ యు బాయ్`` అంటూ గ‌తంలో తన ప్రేమాభిమానాలను చాటుకున్నారు. అలాగే అల్లు అర్హ బర్త్‌డే సందర్భంగా త‌న‌తో కలిసి దిగిన ఒక క్యూట్ అండ్ స్వీట్ ఫొటోను షేర్ చేస్తూ.. ఆ చిన్నారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు. మెగా - అల్లు కుటుంబాల మధ్య ఉన్న బలమైన అనుబంధానికి ఇవ‌న్నీ నిద‌ర్శ‌నాలు.

Tags:    
  • ramcharan 
  • upasanakonidela 
  • klinkaara 
  • alluarjun 
  • megafamily 
  • tollywood 
  • telugucinema 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS