2026 మొదటి 6 నెలలు.. టాలీవుడ్ బాక్సాఫీస్ ఎవరి సొంతం?
ఫిబ్రవరి , మార్చి నెలల్లో సర్‌ప్రైజ్ హిట్స్ కనిపించాయి. హడావుడి లేకుండా వచ్చిన కొన్ని మంచి కంటెంట్ సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి.
సినిమా ప్రేమికులకు, అభిమానులకు ఈ ఏడాది మొదటి ఆరు నెలలు థియేటర్లలో పండగలా గడిచిపోయాయి.. 2026 జనవరి నుండి జూన్ వరకు టాలీవుడ్‌లో దాదాపు 40 నుండి 50 సినిమాలు రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. కొన్ని సినిమాలు ఊహించని రేంజ్‌లో హిట్లు కొడితే, మరికొన్ని ఆడియన్స్‌ను మెప్పించడంలో కాస్త వెనకబడ్డాయి. ఈ ఆరు నెలల కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏయే సినిమాలు ఏలాయో, ఏవి సూపర్ హిట్ అయ్యాయో ఓ లుక్కేద్దాం రండి..
జనవరి: పండగ సీజన్ బ్లాక్‌బస్టర్స్:
సంక్రాంతి, కొత్త ఏడాది కానుకగా జనవరిలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఇచ్చాయి. అందరూ ఎంతో ఆశలు పెట్టుకున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా, మిగతా సినిమాలు మాత్రం దుమ్ములేపాయి. ముఖ్యంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘బ్లాక్‌బస్టర్’గా నిలిచి ఫ్యాన్స్‌కు అసలైన పండగ తెచ్చింది. వీటితో పాటు ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ సినిమాలు కూడా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్లాయి.
ఫిబ్రవరి , మార్చి నెలల్లో సర్‌ప్రైజ్ హిట్స్ కనిపించాయి. హడావుడి లేకుండా వచ్చిన కొన్ని మంచి కంటెంట్ సినిమాలు ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. కపుల్ ఫ్రెండ్లీ, హే బల్వంత్ చిత్రాలు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని హిట్ లిస్ట్‌లో చేరిపోయాయి. ఇక మార్చి విషయానికి వస్తే ‘పాపం ప్రతాప్’ సినిమా యావరేజ్‌గా నిలవగా, ఎవరూ ఊహించని విధంగా ‘యుఫోరియా’ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తూ ‘సర్‌ప్రైజ్ హిట్’గా నిలిచింది.
ఏప్రిల్ - మే: సమ్మర్ రేసులో దూసుకెళ్లిన చిత్రాలు:
ఎండలు మండిపోయే ఏప్రిల్ నెలలో థియేటర్లు మాత్రం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. ‘డకాయిట్’, ‘రాకాస’ సినిమాలు సాలిడ్ కలెక్షన్లతో హిట్ కొట్టగా, ‘బైకర్’ సినిమా యావరేజ్‌గా నిలిచింది. మే నెలలో రిలీజ్ అయిన ‘జెట్ లీ’, ‘గాయపడ్డ సింహం’ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జూన్: ఇండస్ట్రీ హిట్లతో బాక్సాఫీస్ షేక్:
ఈ ఆరు నెలల కాలంలో జూన్ నెల టాలీవుడ్‌కు మైండ్ బ్లోయింగ్ ముగింపు ఇచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తూ ‘ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్’గా నిలిచింది, ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక దీనితో పాటు ‘మా ఇంటి బంగారం’ సినిమా కూడా మంచి వసూళ్లతో సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగిస్తోంది.
మొత్తానికి 2026 మొదటి ఆరు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మంచి బూస్ట్‌ను ఇచ్చాయి. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు విభిన్నమైన కథలతో ప్రేక్షకులు థియేటర్లలో ఎంజాయ్ చేశారు. మరి ఈ ఆరు నెలల్లో రిలీజ్ అయిన సినిమాలలో మీ మనసుకు నచ్చిన, మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి..