రజినీ కోసం ధనుష్ వెనక్కి తగ్గుతాడా?

అయితే దీపావళి సీజన్ కూడా అంత మంచి ఛాయిస్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర‌స‌న్ అదే ఫెస్టివల్ విండోను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది.

Update: 2026-06-28 04:02 GMT

కోలీవుడ్‌లో ప్రస్తుతం రిలీజ్ డేట్లపై జరుగుతున్న డిస్క‌ష‌న్ చాలా ఆసక్తికరంగా మారింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైల‌ర్2 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తపై ఇప్పటివరకు క్లారిటీ లేకపోయినా, ఒకవేళ అదే డేట్ ఫిక్సైతే దాని ఎఫెక్ట్ ఇతర భారీ సినిమాల‌పై పడే అవకాశాలపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఆ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ధనుష్ నటిస్తున్న ఓం సినిమా. ప్రస్తుతం ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. అయితే జైల‌ర్2 అక్టోబర్ రిలీజైతే, ఆ క్లాష్‌ను నివారించేందుకు ఓం ను దీపావళి సీజన్‌కు వాయిదా వేసే అవకాశముందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే దీపావళి సీజన్ కూడా అంత మంచి ఛాయిస్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఆర‌స‌న్ అదే ఫెస్టివల్ విండోను టార్గెట్ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న రామాయ‌ణ కూడా అదే టైమ్ లో వస్తే, థియేటర్ల లభ్యత నుంచి ఆడియ‌న్స్ ఫోక‌స్ వరకు ప్రతి అంశంపైనా ప్రభావం ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ఫెస్టివల్ సీజన్లలో రిలీజ‌య్యే పెద్ద సినిమాల మధ్య పోటీ మరింత పెరిగింది. ముఖ్యంగా నవరాత్రి, దసరా, దీపావళి వంటి వరుస సెలవుల సీజన్స్‌ను నిర్మాతలు క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఒకే సమయంలో రెండు లేదా మూడు భారీ సినిమాలు వస్తే థియేటర్ షేరింగ్, షో కేటాయింపులు, అడ్వాన్స్ బుకింగ్స్ వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. అందుకే రిలీజ్ డేట్ ఎంపిక కూడా ఇప్పుడు సినిమా స‌క్సెస్ లో ముఖ్యమైన వ్యూహంగా మారింది.

ఈ నేపథ్యంలో ఓం దీపావళికి వెళ్తే అది కేవలం రిలీజ్ డేట్ మార్పు మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ పోటీని మరింత కఠినంగా మార్చే నిర్ణయంగా మారొచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు స్టార్ హీరోల మధ్య పోటీ, మరోవైపు పాన్ ఇండియా సినిమాల ప్రభావం ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం అంత తేలికైన విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ డిస్క‌ష‌న్స్ అన్నీ ఊహాగానాలకే పరిమితమ‌య్యాయి. జైల‌ర్2 రిలీజ్ డేట్ పై అఫీషియ‌ల్ క్లారిటీ వ‌చ్చాకే ఓం రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అప్పటి వరకు కోలీవుడ్‌లో రిలీజ్ క్యాలెండర్‌పై ఆసక్తికరమైన చర్చలు కొనసాగడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News