ప్రభాస్ ఫౌజీ రిలీజ్ డేట్ లాక్!
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి టీమ్ ఫిక్స్ అయిందట.
రెబెల్ స్టార్ ప్రభాస్, క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ డ్రామా ఫౌజీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. స్వాతంత్ర్యానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి అంచనాలు భారీగా పెరిగాయి. ‘ది రాజా సాబ్’ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ దాదాపు ఫైనల్ చేసేశారు. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం..
డిసెంబర్ 3న రిలీజ్ ప్లాన్:
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం ఒక చిన్న ఆడియో గ్లింప్స్, టైటిల్ పోస్టర్ మినహా మేకర్స్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి టీమ్ ఫిక్స్ అయిందట. ఇక దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చాలా త్వరలోనే రాబోతోంది.
చివరి దశకు చేరిన షూటింగ్:
దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను దేశభక్తి నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే బలమైన ఎమోషన్లతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తయిపోయింది. ఇక ప్రస్తుతం సినిమా పనులు శరవేగంగా చివరి దశకు చేరుకుంటున్నాయి. డిసెంబర్ రిలీజ్ విండోను టార్గెట్ పెట్టుకోవడంతో, మేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి కూడా ప్లాన్ రెడీ చేస్తున్నారు.
సోల్జర్ పాత్రలో ప్రభాస్.. క్రేజీ కాస్టింగ్:
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ సోల్జర్ పాత్రలో కనిపించబోతుండటం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ మూవీ ద్వారా ఇమాన్వి అనే కొత్త అమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్రభాస్ పక్కన ఈ కొత్త జోడి ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇక వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, అలాగే జయప్రద వంటి లెజెండరీ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హను రాఘవపూడి మార్క్ లవ్ స్టోరీతో పాటు గ్రాండ్ దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ‘ఫౌజీ’ సినిమా ప్రభాస్ లైనప్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక విభిన్నమైన పీరియడ్ డ్రామాతో రాబోతుండటంతో, డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ రేంజ్ ఊచకోత ఎలా ఉండబోతోందో చూడాలి..