ట్రైలర్‌తో హైప్ డబుల్ చేయనున్న లెనిన్ టీమ్!
అఖిల్ కెరీర్ పరంగా కూడా ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. అఖిల్ గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఈసారి కమర్షియల్ హిట్ సాధించాలనే టార్గెట్ తో అఖిల్ కనిపిస్తున్నాడు.
అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను జూన్ 30న రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ ఇప్పటివరకు మేకర్స్ ప్రమోషన్స్ ను ఆశించిన స్థాయిలో నిర్వహించడం లేదని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా రిలీజ్‌కు కేవలం కొన్ని రోజులే మిగిలి ఉండగా ప్రమోషన్స్ ఎందుకు మొదలుపెట్టడం లేదనే ప్రశ్నలు వినిపించాయి. ఇప్పుడు ఆ సందేహాలకు చెక్ పెడుతూ ట్రైలర్‌తో పాటు వరుస ప్రమోషనల్ ఈవెంట్లకు చిత్రబృందం శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, లెనిన్ ట్రైలర్‌ను పూర్తిగా కమర్షియల్ కట్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ ఎలివేషన్ షాట్లు, పవర్‌ఫుల్ డైలాగ్స్, హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయని చెబుతున్నారు. ఫ్యామిలీ, యూత్, మాస్ అనే మూడు వర్గాల ప్రేక్షకులను ఒకేసారి ఆకట్టుకునేలా ట్రైలర్‌ను కట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అఖిల్ కెరీర్ పరంగా కూడా ఈ సినిమా అత్యంత కీలకంగా మారింది. అఖిల్ గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, ఈసారి కమర్షియల్ హిట్ సాధించాలనే టార్గెట్ తో అఖిల్ కనిపిస్తున్నాడు. అందుకే ట్రైలర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన మేకర్స్, సినిమాపై బజ్‌ను ఒక్కసారిగా పెంచే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మంచి ట్రైలర్ వస్తేనే సినిమా గురించి సాధారణ ప్రేక్షకుల్లో కూడా హైప్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ట్రైలర్ రిలీజైన తర్వాత ప్రచార కార్యక్రమాలు కూడా వేగం అందుకోనున్నాయని తెలుస్తోంది. హీరో అఖిల్‌తో పాటు చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి కార్యక్రమాలతో సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రిలీజ్‌కు ముందు ప్రతి రోజూ ఒక కొత్త అప్డేట్ వచ్చేలా ప్రచార వ్యూహాన్ని మేకర్స్ రెడీ చేసినట్లు టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
దీంతో ఇప్పుడందరి దృష్టి జూన్ 30న రిలీజ్ కానున్న లెనిన్ ట్రైలర్‌పైనే దృష్టి నెలకొంది. ట్రైలర్ నిజంగానే మాస్ కమర్షియల్ ట్రీట్‌గా నిలిచి సోషల్ మీడియాలో వైరల్ అయితే, ఇప్పటివరకు నెమ్మదిగా సాగిన ప్రమోషన్స్ ఒక్కసారిగా ఊపందుకుని, జులై 10న రిలీజవనున్న లెనిన్ సినిమాకు కావాల్సిన హైప్‌ను తీసుకురావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.