• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ...

ఒకే ఫ్రేమ్‌లో దిగ్గ‌జ లెజెండ్స్‌

| ఓటీటీలు, కామిక్స్‌, డిజిట‌ల్ మీడియా, యానిమేష‌న్‌, వీఎఫ్ ఎక్స్ ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-01 10:45 GMT

అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌నే ల‌క్ష్యంతో కేంద్ర ప్ర‌భుత్వం `వ‌ర‌ల్డ్ ఆడియో విజువ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ్మిట్ (వేవ్స్‌)ను ముంబ‌యిలో నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం మే 1 నుంచి 4 వ‌ర‌కు ముంబ‌యి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. ఈ కార్య‌క్ర‌మంలో ఇండియ‌న్ సినిమాల గురించి మాత్ర‌మే కాదు. ఓటీటీలు, కామిక్స్‌, డిజిట‌ల్ మీడియా, యానిమేష‌న్‌, వీఎఫ్ ఎక్స్ ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో భార‌తీయ చ‌ల‌న చిత్ర దిగ్గ‌జాలు పాల్గొన్నారు. ఇక ఈ కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీప్రారంభించారు. మారుతున్న సాంకేతిక‌త నుంచి యంగ్ జ‌న‌రేష‌న్‌ని కాపాడాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఎంతో ఉంద‌న్నారు. ఇదిలా ఉంటే ఈ కార్య‌క్ర‌మంలో ఓ అరుదైన‌స‌న్నివేశం చోటు చేసుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి ర‌జ‌నీకాంత్‌, చిరంజీవి, మోహ‌న్‌లాల్ ముంబ‌యికి వెళ్లిన విష‌యం తెలిసిందే. ఉత్త‌రాదికి చెందిన న‌టీన‌టులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఒక‌నాటి డ్రీమ్ గ‌ర్ల్, రాజ‌కీయ నేత హేమామాలిని, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అక్ష‌య్ కుమార్ కూడా పాల్గొన్పారు. ఈ సంద‌ర్భంగా గురువారం వేవ్స్ వేడుక జ‌రుగుతున్న స‌మ‌యంలో మోహ‌న‌ల్ లాల్‌, ర‌జ‌నీకాంత్‌, హేమామాలిని, చిరంజీవి, అక్ష‌య్ కుమార్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఒకే ద‌గ్గ‌ర క‌లిసి ఫొటొల‌కు పోజులిచ్చారు. ఈ లెజెండ్స్ అరుదైన క‌ల‌యిక‌కు సంబంధించిన ఫొటోల‌ని మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Tags:    
  • WAVES2025 
  • IndianCinemaLegends 
  • Rajinikanth 
  • Chiranjeevi 
  • Mohanlal 
  • HEMASpecial 
  • GlobalEntertainmentSummit 
  • Filmindustry 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS