మిరాయ్: మీడియం రేంజ్ మూవీస్‌లో రికార్డ్ కలెక్షన్స్

మిరాయ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది నాగచైతన్య తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డే 2లో రూ. 7.42 కోట్లను రాబట్టింది.;

Update: 2025-09-14 14:00 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్‌కి మళ్లీ ఊపును తీసుకువచ్చిన సినిమా మిరాయ్. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ తో సెన్సేషనల్ ఫీట్ సాధించింది. ముఖ్యంగా డే 2 కలెక్షన్స్‌లో మిరాయ్, మీడియం రేంజ్ మూవీస్ కేటగిరీలో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. ఈ విజయంతో తేజ సజ్జ తన కెరీర్‌లో మరో రికార్డ్ ను చేరుకున్నాడు.

డే 2లో మిరాయ్ ఏకంగా రూ. 8.2 కోట్ల గ్రాస్‌ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబట్టింది. ఇది ఇప్పటివరకు వచ్చిన మీడియం రేంజ్ మూవీస్‌లో అత్యధిక డే 2 రికార్డ్ కావడం విశేషం. ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం, వర్క్‌డేస్‌కి కూడా బలమైన అడ్వాన్స్ బుకింగ్స్ సాధిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ యూత్ కిడ్స్ అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉండటంతో మిరాయ్ రిపిటేడ్ ఆడియెన్స్ కూడా పెరుగుతున్నారు.

మిరాయ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది నాగచైతన్య తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డే 2లో రూ. 7.42 కోట్లను రాబట్టింది. థర్డ్ స్పాట్‌లో సిద్దూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ ఉంది, రూ. 7.36 కోట్లతో. నాలుగో స్థానంలో కుబేరా 7.21 కోట్లతో నిలవడం గమనార్హం. ఐదో స్థానంలో ఉన్నది ఉప్పెన, ఇది రూ. 6.86 కోట్లను రాబట్టి తన సత్తా చాటుకుంది.

ఆరవ స్థానంలో హిట్ 3, ఏడో స్థానంలో దసరా ఉంది, ఎనిమిదో స్థానంలో విరూపాక్ష లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక తొమ్మిదో స్థానంలో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి 5.36 కోట్లను సాధించింది. పదో స్థానంలో నాగ చైతన్య సమంత కాంబినేషన్‌లో వచ్చిన లవ్ స్టోరీ, రూ. 5.08 కోట్లతో ఉంది. ఈ ర్యాంకింగ్స్ చూస్తే మిరాయ్ ప్రభంజనం స్పష్టంగా అర్థమవుతుంది.

ఒక్క రోజులోనే 8.2 కోట్లను సాధించడం సాధారణ విషయం కాదు. దీనివల్ల మిరాయ్, బాక్సాఫీస్ రేసులో ముందు వరుసలో నిలిచింది. తండేల్, టిల్లు స్క్వేర్, కుబేరా లాంటి సినిమాలు కూడా బలమైన కలెక్షన్స్‌ను సాధించినా, మిరాయ్ సెట్ చేసిన రికార్డు వారందరిని అధిగమించింది. మొత్తానికి, మిరాయ్ సక్సెస్ టాలీవుడ్‌కు కొత్త ఊపిరి పోసిందని చెప్పాలి. మీడియం రేంజ్ సినిమాలు కూడా సరైన కంటెంట్‌తో వస్తే బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించగలవో మిరాయ్ మరోసారి రుజువు చేసింది. ఇక ఈ సినిమా వీకెండ్ అనంతరం ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

మిరాయ్: 8.2 కోట్లు

తండేల్: 7.42 కోట్లు

టిల్లు స్క్వేర్: 7.36 కోట్లు

కుబేరా: 7.21 కోట్లు

ఉప్పెన: 6.86 కోట్లు

హిట్ 3: 6.03 కోట్లు

దసరా: 5.86 కోట్లు

విరూపాక్ష: 5.80 కోట్లు

ఖుషి: 5.36 కోట్లు

లవ్ స్టోరీ: 5.08 కోట్లు

Tags:    

Similar News