• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌండ్ లేకుండా క్యూట్...

సౌండ్ లేకుండా క్యూట్ హీరోయిన్ నిశ్చితార్థం

| క్యూట్ నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న మేఘా ఆకాష్ “లై” సినిమాతో నితిన్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయింది

By - Tupaki Desk
Update: 2024-08-23 05:25 GMT

క్యూట్ నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను దోచుకున్న మేఘా ఆకాష్ “లై” సినిమాతో నితిన్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె విజయ్ ఆంటోని సరసన నటించిన "తూఫాన్" సినిమాలో కనిపించింది.

ఇప్పుడు ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఆమె ఒక సరికొత్త అడుగులు వేసేందుకు సిద్ధమైంది. కొద్దిసేపటి క్రితమే మేఘా ఆకాష్ తన చిరకాల స్నేహితుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం జరుపుకుంది. ఈ నిశ్చితార్థ వేడుక అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో చాలా సైలెంట్ గానే జరిగింది. ఈ ఇద్దరు గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారని సమాచారం.

వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా, సాయి విష్ణు గురించి పెద్దగా వివరాలు ఏమి లీక్ కాలేదు. అయితే, వీరి వివాహానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే వెలువడనుంది. మేఘా ఆకాష్ వయసు ప్రస్తుతం 28 సంవత్సరాలు. చెన్నై కు చెందిన ఆమె విదేశాల్లో చదువుకుని అనంతరం మోడల్ గా గుర్తింపు అందుకుంది.

ఇక మొదట్లోనే ఆమె టాలీవుడ్ లో గ్లామర్ పరంగా మంచి క్రేజ్ అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు రాలేవు. చివరిగా ఆమె తెలుగులో మను చరిత్ర అనే సినిమా చేసింది. అంతకుముందు రవితేజ రావణాసుర లో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది. కానీ ఏ సినిమా కూడా క్లిక్ కాలేదు. ప్రస్తుతం మేఘ “విక్కటకవి” మరియు “సహకుటుంబనం” అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు త్వరలోనే విడుదలయ్యే అవకాశముంది.

ఇక ఈ బ్యూటీ ని ఫాలో అయ్యే నెటిజన్లు వివాహం తర్వాత కూడా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తుందా లేదా అనే విషయంపై ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం పై త్వరలోనే మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. మేఘా ఆకాష్ తన సినీ ప్రస్థానంలో సక్సెస్ లు చూడకపోయినా కూడా తన క్యూట్ అందంతోనే అవకాశాలు అందుకుంటూ, తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరి ఆమె కెరీర్ పెళ్లి తరువాత ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    
  • Meghaakashengaged 
  • Saaivishnu 
  • Meghaakash 
  • Liemovieactres 
  • Filmindustry 
  • Meghaakashsaai 
  • Vikkatakavi 

Similar News

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

Copyright @2026

Powered by Blink CMS