ఒకే కంచం..మంచం అన్న‌ట్లే ఒకే నెంబ‌ర్ కూడా!

తాజాగా ఈ బ్యూటీలిద్ద‌రు ఇండ‌స్ట్రీలో ఎంత బిజీగా ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Update: 2024-05-23 00:30 GMT

జాన్వీకపూర్ - సారా అలీఖాన్ స్నేహం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు బాల్యం నుంచి స్నేహితులు. ఎంతో క్లోజ్ గా ఉంటారు. బెస్ట్ ప్రెండ్స్ ఎవ‌రంటే? వారిద్ద‌రు వారి పేర్లే చెబుతారు. ఒకే మంచం..ఒకే కంచం అన్నంత‌గా ఇద్దరూ మెలుగుతారు. సినిమాల్లోకి రావ‌డం ద‌గ్గ‌ర నుంచి స‌క్సెస్ అవ్వ‌డం ప్రతీది ఈక్వ‌ల్ అనేస్తారు. తాజాగా ఈ బ్యూటీలిద్ద‌రు ఇండ‌స్ట్రీలో ఎంత బిజీగా ఉన్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

'ధ‌డ‌క్' సినిమాతో జాన్వీ క‌పూర్- 'కేధ‌ర‌నాద్' తో సారా అలీఖాన్ లాంచ్ అయ్యారు. మ‌రి వీరిద్ద‌రు ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్ని సినిమాలు చేసారంటే? క‌చ్చితంగా ఆ నెంబ‌ర్ మారే ఉంటుంద‌నుకుంటారంతా. ఒక‌రు ఎక్కువ చేయ‌డానికి లేదా త‌క్కువ‌గా చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కానీ ఈ ప్రెండ్స్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వ‌లేదు. ఇద్ద‌రు కూడా ఒకే నెంబ‌ర్ మెయింటెన్ చేసారు. జాన్వీ క‌పూర్ 13 సినిమాలు చేస్తే..సారా అలీఖాన్ కూడా 13 సినిమాలే చేసింది.

అలా స్నేహితురాళ్లు ఇద్ద‌రు ఒకే నెంబ‌ర్ ని మెయింటెన్ చేస్తున్నారు. మ‌రి యాదృశ్చికంగా జ‌రిగిందా? లేక అనుకునే చేస్తున్నారా? అన్న‌ది వాళ్ల‌కే తెలియాలి. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్ నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది. అందులో ఒక తెలుగు సినిమా ఉంది. అదే 'దేవ‌ర'. ఈ సినిమాతో పాన్ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఇక‌ సారా అలాఖాన్ మూడు సినిమా షూటింగ్ లోతో బిజీగా ఉంది. తెలుగులోనూ లాంచ్ అవ్వాల‌ని వెయిట్ చేస్తోంది.

జాన్వీ క‌పూర్ ద్వారా ఇక్క‌డి అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. బాలీవుడ్ లో మాత్రం ఇటీవ‌లే మ‌రో రెండు సినిమాల‌కు సైన్ చేసిన‌ట్లు మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. ఓసినిమాలో సాహ‌సోపేత‌మైన పాత్ర పోషిస్తుంద‌ని వినిపిస్తుంది. ఇంత‌వ‌ర‌కూ అలాంటి పాత్ర‌ను ఏ న‌టి పోషించ‌లేద‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ ఆ సినిమా వివ‌రాలు మాత్రం గోప్యంగా ఉన్నాయి. అలాగే అన్ని అనుకూలిస్తే స్నేహితులిద్ద‌రు ఒకే ఇంటికి తోడికోడ‌ళ్ల‌గానూ వెళ్లే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News