• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుంటూరు కారం.. మహేష్...

గుంటూరు కారం.. మహేష్ హార్ట్ బ్రేకింగ్ సాంగ్

| నిన్న గుంటూరులో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ జరగ్గా.. తమన్ మావా ఎంతైనా సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

By - Tupaki Desk
Update: 2024-01-10 04:03 GMT

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మహేశ్ సరికొత్తగా మాస్ యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే మూడు పాటల రిలీజ్ అవ్వగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కుర్చీ మడత పెట్టి సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. నిన్న గుంటూరులో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈ వెంట్ జరగ్గా.. తమన్ మావా ఎంతైనా సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

ఇప్పుడీ ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు."బావా ఎంతైనా పర్లేదు బిల్లు.. మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు.. గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు.. చెప్పుకోలేని బాధే డబల్లు.. మారిపోయే లోకం.. చెడ్డోళ్లంతా ఏకం.. నాజుక్కు అయినా నాబోటోడికి దినదినమోక నరకం.. యాడో లేదు లోపం.. నామీదే నాకు కోపం.. అందనన్నా ఆకాశానికి ఎంతకని ఎగబడతాము" అంటూ సాగే హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ఆకట్టుకుంటోంది.

ఈ సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా.. శ్రీ కృష్ణ, రామాచారి ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వన్ ఆఫ్ ది బెస్ట్ హార్ట్ బ్రేకింగ్ సాంగ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఈ పాటలో మహేశ్ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేశాడని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అని చెబుతున్నారు. సరైన సంక్రాంతి సినిమా గుంటూరుకారమే అని కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ ఒక్కో పాటకు అద్భుతంగా డాన్స్ చేసి అదరగొట్టేశారని అర్థమవుతోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేశ్ తోపాటు శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా.. మీనాక్షీ చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ.. హారిక్ అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు.

Full View
Tags:    
  • Tollywood 
  • Maheshbabu 
  • Trivikram 
  • Sreeleela 
  • Meenakshichaudhary 
  • Mawaaenthaina 
  • Lyricalsong 
  • Gunturkaram 
  • Gunturkarammovie 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS